జయలలిత ఆక్రమాస్తుల కేసు తీర్పు నేడే: శశికళ జైలుకా ? సీఎం కుర్చీకా ?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో ఏ-2 ముద్దాయిగా ఉన్న శశికళ నాటరాజన్ భవితవ్వం మంగళవారం తేలిపోనుంది. ఈ కేసులో శశికళ దోషిగా తేలితే కచ్చితంగా జైలుకు వెళ్లాల్సి రావచ్చు.
తమిళనాడు ముఖ్యమంత్రి పీఠం కోసం తహతహలాడుతున్న శశికళకు ఆమె ఆశలు గల్లంతు అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే నిర్దోషిగా బయటపడితే ఆమెకు ముఖ్యమంత్రి పీఠంతో సహ ఎమ్మెల్యేల మద్దతు అనుకూలంగా మారే అవకాశం ఉంది.
జయలలిత అక్రమాస్తుల కేసులో తీర్పు వారం రోజుల్లో ఇవ్వనున్నట్లు ఇటీవల సుప్రీం కోర్టు ప్రకటించింది. అయితే ఈ కేసు తీర్పు వెలువడక ముందే జయలలిత మరణించడంతో ఆమె పేరు కేసు నుంచి తొలగించాలని గత వారం కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టుకు మనవి చేసింది.

జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమె తరువాత రెండో ముద్దాయిగా శశికళ, తరువాత వరుసగా ఇళవరసి, సుధాకరన్ ముద్దాయిలుగా ఉన్నారు. రూ. 66 కోట్ల అక్రమాస్తుల కేసు చెన్నై, బెంగళూరులో గత 18 ఏళ్లుగా వచారణ జరిగింది.
ఇదే కేసులో జయలలితతో పాటు శశికళ జైలు జీవితం అనుభవించారు. 2014లో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు జయలలితకు 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 100 కోట్లు జరిమానా, శశికళ, ఇళవరసి, సుధాకరన్ లకు రూ. 10 కోట్ల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో జైలుకు వెళ్లిన జయలలిత తదిరులు తరువాత జామీనుపై బయటకు వచ్చి కర్ణాటక హై కోర్టులో సవాలు చేశారు. కర్ణాటక హై కోర్టు కేసు కొట్టివేయడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు. ఈ కేసు తీర్పు మంగళవారం ఉదయం 10.30 గంటలకు వెలువడనుండటంతో శశికళ వర్గీయుల్లో టెన్షన్ మొదలైయ్యింది.












Click it and Unblock the Notifications