వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ ఆస్తులకు వారసుడెవరు? వీలునామా లేదు, ఆస్తులెవరికీ?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగతంగా వీలునామా రాశారంటూ ఎలాంటి అధికారికంగా నమోదు కాలేదని ఆర్టీఐ ధరఖాస్తుకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. జయలలిత వీలునామా రాశారనే ఊహాగానాలే దీంతో తెరపడింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగతంగా వీలునామా రాశారంటూ ఎలాంటి అధికారికంగా నమోదు కాలేదని ఆర్టీఐ ధరఖాస్తుకు ప్రభుత్వం సమాధానమిచ్చింది. జయలలిత వీలునామా రాశారనే ఊహాగానాలే దీంతో తెరపడింది.

జయలలిత చనిపోకముందు వ్యక్తిగతంగా వీలునామా రాశారంటూ వస్తున్న ఊహాగానాలకు తెరపడింది.ఈ విషయమై సమాచార కార్యకర్త ఎస్. భాస్కరన్ తమిళనాడు వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్ శాఖ ను ఆర్టీఐ కింద ధరఖాస్తు చేశాడు.

jayalalithaa

అధికారికంగా వీలునామాల నమోదును సీటీడీఆర్ చేపడుతోంది. ఈ నేపథ్యంలో సీటీడీఆర్ స్పందిస్తూ జయలలిత వీలునామా గురిించి ఎలాంటి పత్రాలు గానీ, సమాచారం గానీ తమ వద్ద లేదని తెలిపింది.

గత ఏడాది డిసెంబర్ 6వ, తేదిన జయలలిత మరణించింది.ఆమె మరణించిన నాటి నుండి పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం సహా ఆమె ఆస్తులు ఎవరి పరమౌతాయని చర్చ సాగుతోంది. ఆమె ఆస్తులకు చట్టబద్ద వారసుడు ఎవరు అనే చర్చ కూడ లేకపోలేదు.

జయలలిత పేరిట సుమారు రూ.113.72 కోట్ల ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది, అయితే , తన వారసుడి గురించి తన ఆస్తులు ఎవరికి చెందాలనే దాని గురించి జయలలిత వీలునామా రాసినట్టు గతంలో కథనాలు వచ్చాయి. అయితే జయలలిత వీలునామా రాసినట్టు తమకు తెలియదని ఆమె వ్యక్తిగత లీగల్ వ్యవహరాలను పర్యవేక్షించిన అన్నాడిఎంకె న్యాయవాదులు గతంలో పేర్కొన్నారు.తాజాగా ప్రభుత్వం కూడ ఇలాంటి సమాచారమే ఇవ్వడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనే మిస్టరీ ఇంకా కొనసాగుతోంది.

English summary
Tamil nadu governament reveled on Monday that former chief minister Jayalalithaa didn't wrote will .RTI activist asked to government about jaya's will.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X