చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శశికళకు షాక్, 20 డొల్లా కంపెనీలు, విదేశాలకు నగదు, ఈడీ ఎంట్రీ, 100 బ్యాంక్ అకౌంట్లు, సీజ్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: వీకే శశికళ నటరాజన్ కుటుంబ సభ్యుల ఆస్తులపై ఆదాయపన్ను శాఖ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. డొల్ల కంపెనీలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. త్వరలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగడానికి సిద్దం అయ్యింది. శశికళ కుటుంబ సభ్యుల ఆస్తులు సీజ్ చేసే అవకాశాలు ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు హడలిపోతున్నారు.

టార్గెట్ శశికళ

టార్గెట్ శశికళ

శశికళ కుటుంబ సభ్యులను లక్షంగా చేసుకుని 2017 నవంబర్ నెలలో చెన్నైతో పాటు తమిళనాడు, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏకకాలంలో 187 ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేసి అక్రమాస్తులు గుర్తించి వాటి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

జయా టీవీ, మిడాస్ !

జయా టీవీ, మిడాస్ !

జయా టీవీ, జాజ్ సినిమాస్, కాంచీపురం జిల్లా పడప్పైలోని మిడాస్‌ మద్యం కంపెనీ, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత వ్యక్తిగత సహాయకుడు పూంకుండ్రన్‌ నివాసం, శశికళ మేనల్లుడు వివేక్‌, మేనకోడళ్లు కృష్ణప్రియ, షకిలా, డాక్టర్ శ్రీనివాసన్, టీటీవీ దినకరన్, దివాకరన్ తదితరుల నివాసాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు.

పోయెస్ గార్డెన్

పోయెస్ గార్డెన్


పోయెస్‌గార్డెన్‌లోని జయలలిత నివాసం వేదనిలయంలో సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను శాఖ అధికారులు అక్కడ శశికళ గదిలో ల్యాప్‌టాప్‌, పెన్‌డ్రైవ్‌, జయలలితకు డీజీపీ అశోక్‌కుమార్‌ గుట్కా స్కాం గురించి రాసిన ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు.

రూ. ఐదు వేల కోట్లు

రూ. ఐదు వేల కోట్లు


1996 తరువాత శశికళ, ఆమె కుటుంబ సభ్యులు డొల్లా కంపెనీలు ప్రారంభించారని, 2011లో జయలలిత అధికారంలోకి వచ్చిన తరువాత 20కి పైగా డొల్లా కంపెనీలు స్థాపించారని, దాదాపు రూ. 5 వేల కోట్లకు పైగా పన్ను ఎగవేశారని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు.

100 బ్యాంకు అకౌంట్లు

100 బ్యాంకు అకౌంట్లు

శశికళ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న కొన్ని డొల్లా కంపెనీలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాటిని బ్లాక్ లిస్టులో పెట్టింది. శశికళ కుటుంబ సభ్యులకు చెందిన 100 బ్యాంకు అకౌంట్లు, విదేశీ బ్యాంకు అకౌంట్లు గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

విదేశాలకు నగదు

విదేశాలకు నగదు

శశికళ కుటుంబ సభ్వులకు చెందిన డొల్లా కంపెనీల బ్యాంకు ఖాతాలు నుంచి విదేశాలకు నగదు బదిలీ అయ్యిందని ఆదాయపన్ను శాఖ అధికారుల విచారణలో వెలుగు చూసింది. విదేశాలకు నగదు బదిలీ వ్యవహారం బయటపడటంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)కి సమాచారం ఇచ్చారు.

రంగంలోకి ఈడీ

రంగంలోకి ఈడీ

విదేశాల్లోని శశికళ కుటుంబ సభ్యుల పెట్టుబడులు వెలుగులోకి రావడంతో ఈడీ రంగంలోకి దిగడానికి సిద్దం అయ్యింది. విచారణ చేసేకొద్దీ కొత్త ఆస్తులు బయటపడే అవకాశాలు ఉన్నాయని ఆదాయపన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ దెబ్బతో శశికళ కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైయ్యింది.

రూ. 380 కోట్ల ఎస్టేట్ సీజ్

రూ. 380 కోట్ల ఎస్టేట్ సీజ్

గుజరాత్ కు చెందిన మనీష్, సునీల్ అనే ఇద్దరు వ్యక్తులు చెన్నైలోని ఎమ్ ఆర్ పీ నగర్ లో ఆది ఎంటర్ ప్రైజస్ అనే భోగస్ సంస్థను నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ శశికళ బినామీలు అని ఆదాయపన్ను శాఖ అధికారులు గుర్తించారు. ఆది సంస్థకు చెందిన రూ. 380 కోట్ల విలువైన 4.3 ఎకరాల ఎస్టేట్ ను ఆదాయపన్ను శాఖ అధికారులు సీజ్ చేశారు.

 బినామీలు మాయం

బినామీలు మాయం

ఆది ఎంటర్ ప్రైజస్ కు చెందిన మనీశ్, సునీల్ మాయం అయ్యారు. వారిద్దరినీ విచారణ చేస్తే శశికళ కుటుంబ సభ్యులకు చెందిన మరన్ని బినామీ ఆస్తులు బయటకు వస్తాయని ఆదాయపన్ను శాఖ అధికారులు అంటున్నారు. జయలలిత అధికారాన్ని అడ్డంపెట్టుకుని శశికళ కుటుంబ సభ్యులు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు సంపాధించారని ఆదాయపన్ను శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
VK Sasiakala Natarajan: Tamil Nadu Income Tax department has attached Rs380 crore estate in Chennai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X