చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మాతృభూమిలో తొలిసారి : 44వ చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 44వ చెస్ ఒలింపియాడ్ పోటీలు తమిళనాడులో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశమంతా చుట్టేసిన ఒలింపియాడ్ టార్చ్‌ను ప్రధాని మోడీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌కు ఐదుసార్లు ప్రపంచ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ అందజేశారు. కాగా, మొట్టమొదటిసారి చెస్ ఒలింపియాడ్ కు భారత్ ఆతిథ్యం ఇస్తుండటం విశేషం. ఆగస్టు 10వ తేదీ వరకు పోటీలు జరుగుతాయి. విశ్వనాథన్ ఆనంద్ ఆటగాళ్లకు మెంటర్‌గా వ్యవహరించనున్నారు.

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. చదరంగం(చెస్) మాతృభూమిపై ప్రతిష్టాత్మక ఈవెంట్ జరగడం ఆనందంగా ఉందన్నారు. సొంత ప్రాంతంలో తొలిసారి చెస్ ఒలింపియాడ్ జరుగుతోందన్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఆసియాకు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. క్రీడలు ఎప్పుడూ అద్భుతమైనవేనని, ఇందులో ఓటములుండవన్నారు.

 Tamil Nadu is Chess power house: Prime Minister Narendra Modi declares open 44th Chess Olympiad

తమిళనాడులోని ఆలయాలను పరిశీలిస్తే.. దేవుడు కూడా చెస్ ఆడిన ఆనవాళ్లు కనిపిస్తాయని, అందుకే ఈ రాష్ట్రానికి చెస్ తో ఎంతో చారిత్రక అనుబంధం ఉందన్నారు. అంతేగాక, భారతదేశానికే తమిళనాడు చెస్ పవర్ హౌస్ అయిందని, ఈ రాష్ట్రం ఎంతో మంది గ్రాండ్ మాస్టర్లను తయారు చేసిందన్నారు ప్రధాని మోడీ.

గతంలో తమిళనాడులో జరిగిన కార్యక్రమాల మాదిరిగానే ప్రధాని తన ప్రసంగాన్ని గ్రీటింగ్‌లకు తమిళ పదమైన 'వణక్కం' అని పలికి ప్రారంభించారు. తక్కువ సమయంలోనే నిర్వాహకులు అత్యద్భుతమైన ఏర్పాట్లు చేశారని తెలిపారు. కేంద్రం పూర్తి సహకారంతో తమిళనాడు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లకు అత్యుత్తమ ఆతిథ్యం కల్పిస్తామని హామీ ఇస్తూ, 'మా అతిథులు దేవుడిలాంటి వారు' అని అర్థం వచ్చే 'అతిథి దేవో భవ' నినాదాన్ని మోడీ ఉటంకించారు. అలాగే, ఆతిథ్యం ప్రాముఖ్యతపై తమిళ సన్యాసి కవి తిరువల్లువర్ ద్విపదను ప్రధాని ఉదహరించారు.

తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, ఎల్ మురుగన్ తదితరులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఇక్కడికి 50 కి.మీ దూరంలోని సమీపంలోని మామల్లపురంలో క్రీడా కార్యక్రమం జరుగుతోంది. కాగా, ఒలింపియాడ్ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.

English summary
Tamil Nadu is Chess power house: Prime Minister Narendra Modi declares open 44th Chess Olympiad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X