తమిళనాడు ఎన్నికలు: 90 సీట్లకు తెలుగువాళ్లే కింగ్స్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎవ్వరు కావాలన్నా తెలుగు ఓటర్లు కనికరించాలి. తమిళనాడులో 90 శాసన సభ నియోజ వర్గాల్లో ఎవరు విజయం సాధించాలన్నా తెలుగు ఓటర్లు మద్దతు అవసరం. అలాంటి పరిస్థితి ఈ రోజు తమిళనాడులో ఉంది. తమిళనాడులో అత్యధికంగా ప్రవాసాంధ్రులు నివాసం ఉంటున్నారు.

మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తెలుగు వారు తమిళనాడులోనే స్థిరపడిపోయారు. కొందరు వ్యాపారాలు, కొందరు ఉద్యోగాలు, మరి కొందరు వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది తెలుగు వారు పోటీ చేస్తున్నారు.

ఏ వర్గానికి చెందిన ఓటరును (ఆంధ్రులు) నిర్లక్షం చెయ్యరాదని, వారిని మచ్చిక చేసుకోవాలని ద్రవిడ
ప్రార్టీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. సాంప్రదాయానికి భిన్నంగా ప్రచారంలో తెలుగు మాట్లాడుతున్నారు. పలు నియోజక వర్గాల్లో తెలుగులో కరపత్రాలు ముద్రించి గోడల మీద అతికిస్తున్నారు.

40 శాతం ఓటర్లు

40 శాతం ఓటర్లు

18 శాసన సభ నియోజక వర్గాల్లో తెలుగు ఓటర్లు ఉన్నారు. అక్కడ ఎవరు గెలవాలన్నా వాళ్ల జాతకం తెలుగు వారి చేతిలోనే ఉంది.

ఎండీఎంకే నేత వైగో

ఎండీఎంకే నేత వైగో

ఎండీఎంకే నేత వైగో తుత్తుకూడి జిల్లా కోవిల్ పట్టి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యాలని మొదటి నుంచి భావించారు.అందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారు. (వైగో ఫోటో)

చివరి నిమిషయంలో వైగో గో బ్యాక్

చివరి నిమిషయంలో వైగో గో బ్యాక్

చివరి నిమిషంలో ఎండీఎంకే నేత వైగో కోవిల్ పట్టి నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యరాదని భావించారు. కార్యకర్తల సూచనల మేరకు వైగో అక్కడి నుంచి తప్పుకున్నారు.

తెలుగు, దేవర్ సామాజిక వర్గం

తెలుగు, దేవర్ సామాజిక వర్గం

కోవిల్ పట్టి నియోజక వర్గంలో తెలుగు, దేవర్ సామాజిక వర్గం ఓట్లు అధిక శాతం ఉన్నాయి. ఇక్కడ ఎవ్వరు గెలవాలన్నా ఈ రెండు వర్గాల ఓట్లు కీలకం.

దక్షిణ తమిళనాడులో

దక్షిణ తమిళనాడులో

దక్షిణ తమిళనాడులోని పలు జిల్లాల్లో తెలుగు వారి ప్రభావం చాల ఎక్కువగా ఉంది. అక్కడ తెలుగు ఓటర్లు అభ్యర్థుల జాతకాలు చెప్పనున్నారు.

మన ప్రభావం ఉన్న జిల్లాలు ఇవే

మన ప్రభావం ఉన్న జిల్లాలు ఇవే

దక్షిణ తమిళనాడులోని కోయంబత్తూరు, తుత్తుకుడి, విరుద్ నగర్, తెన్ కాశి, తేని, సేలంతో పాటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని క్రిష్ణగిరి, ధర్మపురి, సేలం, వేలూరు, తిరుత్తిణి, తిరువళ్లూరు తదితర జిల్లాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది.

హోసూరులో ఇద్దరూ తెలుగు వారే

హోసూరులో ఇద్దరూ తెలుగు వారే

బెంగళూరు నగరానికి 30 కిలో మీటర్ల దూరంలో ఉన్న హోసూరు శాసన సభ నియోజక వర్గంలో కాంగ్రెస్ నుంచి గోపీనాథ్, అన్నాడీఎంకే పార్టీ నుంచి బాలక్రిష్ణారెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ తెలుగు వారే.

చెన్నై, కాంచీపురంలో 20 శాతం

చెన్నై, కాంచీపురంలో 20 శాతం

చెన్నై, కాంచీపురంలో 20 శాతం మంది తెలుగు ఓటర్లు ఉన్నారు. ఈ పరిసర ప్రాంతాల్లోని నియోజక వర్గాల్లో ఎవ్వరు గెలవాలన్నా తెలుగు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాలి.

తెలుగు బాషను నిర్లక్షం చేసిన వారికి

తెలుగు బాషను నిర్లక్షం చేసిన వారికి

తెలుగు బాషలో విద్యాభ్యాసం చెయ్యకుండా ప్రతి సారి అడ్డుపడుతున్న వారికి ఈ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని ప్రవాసాంధ్రలు భావిస్తున్నారు.

దగ్గర పడింది

దగ్గర పడింది

తమిళనాడులో ఈ నెల 16వ తేదిన శాసన సభ ఎన్నికలు ఒకే దశలో జరగనున్నాయి. తమిళనాడు సీఎం పీఠం ఎవ్వరికి చిక్కుతుందో అని అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+