చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు: ప్రయాణికుల పరుగులు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని బీచ్‌ స్టేషన్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ సబర్బన్‌ రైలు ప్లాట్‌ఫామ్‌పైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, చెన్నై వర్క్‌షాప్‌ నుంచి కోస్టల్‌ రైల్వేస్టేషన్‌ వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

అయితే, నియంత్రణ కోల్పోయి భారీ శబ్దంతో ప్లాట్‌ఫామ్‌ వైపుపైకి దూసుకోచ్చింది. ఈ క్రమంలో ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ప్రయాణీకులందరూ పరుగులు పెట్టారు. రైలులో ఉన్న వ్యక్తులు కూడా రైలు నుంచి బయటకు దూకారు. ఈ ఘటనపై దక్షిణ రైల్వే వరుసగా మూడు ట్వీట్లలో వివరణ ఇచ్చింది.

 Tamil Nadu: Local Train Derails At Chennai Beach Station, No Casualties Reported

"షెడ్ లైన్ నుంచి ప్లాట్‌ఫారమ్ 1 వరకు ఖాళీ ఈఎంయూ రేక్‌ను ఉంచుతున్నప్పుడు, రేక్ ప్లాట్‌ఫారమ్ బఫర్ ఎండ్‌ను ఓవర్‌షాట్ చేసింది. దీంతో ప్లాట్‌ఫారమ్ 1 దెబ్బతింది. రేక్ పూర్తిగా ఖాళీగా ఉంది, (అక్కడ) ప్రయాణికులు ఎవరూ లేరు. ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాలేదు( అని నివేదించబడింది). ప్లాట్‌ఫారమ్‌పై, షంటర్ రేక్ నుంచి దూకారు కొందరు ప్రయాణికులు. వారికిఎటువంటి గాయాలు కాలేదు'అని దక్షిణ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ జి గుగనేశన్ ట్విట్టర్‌లో డీఆర్ఎం చెన్నై నోట్ విడుదల చేసింది.

"ప్లాట్‌ఫారమ్‌పై ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు జరగలేదు. ఘటనకు కారణాన్ని అంచనా వేయడానికి తగిన స్థాయిలో విచారణ నిర్వహించబడుతుంది." అని పేర్కొంది.
ట్విటర్ వినియోగదారుకు స్పందిస్తూ.. దక్షిణ రైల్వే ఇలా పేర్కొంది.. "సమగ్రమైన విచారణ తర్వాత ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం తెలుస్తుంది. సంబంధిత అధికారులందరూ సంఘటన స్థలంలో ఉన్నారు. పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు." అని తెలిపింది.

కాగా, బ్రేక్ ఫెయిల్యూర్ ఘటనకు కారణంగా అనుమానిస్తున్నారు. రేక్ ప్లాట్‌ఫారమ్ నుంచి బయటకు వచ్చి స్టేషన్ గోడకు ఢీకొట్టడంతో రేక్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు టీవీ విజువల్స్ చూపించాయి.

English summary
Tamil Nadu: Local Train Derails At Chennai Beach Station, No Casualties Reported.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X