తమిళనాడు ఎంపీ ఆత్మహత్యాయత్నం- పరిస్దితి విషమం..!
తమిళనాడుకు చెందిన ఎండీఎంకే ఎంపీ ఎ. గణేశ్ మూర్తి నిన్న అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తన సొంత ఇంట్లోనే పురుగుల మందు తాగారు. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఆయన్ను ఐసీయూలో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఎంపీ పరిస్దితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ గణేశ్ మూర్తి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.
తమిళనాడులోని ఈరోడ్ నియోజకవర్గం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే టికెట్ మీద ఎంపీగా గణేశ్ మూర్తి గెలిచారు. అనంతరం ఆయన పార్టీని వీడి వైగోకు చెందిన ఎండీఎంకేలోకి ఫిరాయించారు. అప్పటి నుంచి ఆయన ఎండీఎంకేలోనే కొనసాగుతున్నారు. కానీ తాజాగా ఆయన అర్ధరాత్రి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆయన పురుగుల మందు తాగడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఐసీయూలో ఎక్మోపై ఉన్న ఎంపీ గణేశ్ మూర్తిని సొంత పార్టీ ఎండీఎంకే నేత వైగోతో పాటు ఇతర పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు పరామర్శించేందుకు ఆస్పత్రికి క్యూ కట్టారు. గణేశ్ మూర్తికి అన్ని పార్టీలతో సత్సంబంధాలే ఉన్నాయి. దీంతో ఆయన ఆత్మహత్యకు ఎందుకు ప్రయత్నించారన్న దానిపై విచారణ జరుగుతోంది. అలాగే కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అన్న దానిపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications