100 రోజుల పెళ్లి వేడుక, నవదంపతుల సజీవదహనం, వారంలో దుబాయ్‌కి, ఇంతలో!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడులోని తేనీ జిల్లా కురంగణి ప్రాంతంలోని అటవిప్రాంతంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించడంతో 9 మంది సజీవదహనం అయ్యారు. ఈ అగ్నిప్రమాదంలో నవదంపతులు సజీవదహనం అయ్యారు. నవ వధువు 90 శాతం కాలిపోయి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి చివరికి మరణించింది.

  ట్రెక్కింగ్‌కు వెళ్లి ప్రమాదంలో పడ్డ విద్యార్థులు, వీడియో !
  ఈరోడ్ దంపతులు

  ఈరోడ్ దంపతులు

  2017 నవంబర్ చివరిలో ఈరోడ్ కు చెందిన వివేక్, దివ్యల వివాహం ఘనంగా జరిగింది. దుబాయ్ లో ఉద్యోగం చేస్తున్న వివేక్ రెండు వారాల క్రితం తమిళనాడులోని సొంత ఊరు అయిన ఈరోడ్ చేరుకున్నాడు. భార్య దివ్యతో పాటు కుటుంబ సభ్యులతో వివేక్ సంతోషంగా గడిపాడు.

  100 రోజుల వేడుక

  100 రోజుల వేడుక

  పెళ్లి జరిగి 100 రోజులు పూర్తి అయిన సందర్బంగా వివేక్, దివ్య దంపతులు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి ఇటీవల ఘనంగా పార్టీ జరుపుకున్నారు. పెళ్లి జరిగి 100 రోజులు పూర్తి కాడంతో ఇద్దరూ తేనీ జిల్లాల్లోని కురంగణి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కు వెళ్లాలని నిర్ణయించారు.

  విమానంలో మున్నార్

  విమానంలో మున్నార్

  వివేక్, దివ్య దంపతులు విమానంలో మున్నార్ వెళ్లారు. తరువాత తేనీ జిల్లాకు చేరుకుని కురంగణి ప్రాంతంలో పర్వతారోహణ శిక్షణకు వెళ్లారు. దంపతులు ఇద్దరూ సంతోషంగా పర్వతారోహణ చేస్తున్న సమయంలో ఆకస్మికంగా మంటలు వ్యాపించాయి.

  వివేక్ సజీవదహనం

  వివేక్ సజీవదహనం

  మంటలు ఒక్కసారిగా చుట్టుముట్టడంతో వివేక్, దివ్య దంపతులు ఆర్తనాదాలు చేశారు. దంపతులు ఇద్దరూ తప్పించుకోవడానికి విఫలయత్నం చేశారు. అయితే దేవుడు కరుణించకపోవడంతో వివేక్ మంటల్లో సజీవదహనం అయ్యాడు.

   90 శాతం కాలిపోయిన దివ్య

  90 శాతం కాలిపోయిన దివ్య

  వివేక్ సజీవదహనం కావడంతో సోమవారం అతని మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకువచ్చారు. 90 శాతం కాలిపోయిన వివేక్ భార్య దివ్యను హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించడంతో ఆమె మృత్యువుతో పోరాటం చేసి చివరికి మరణించింది.

  వారంలో దుబాయ్

  వారంలో దుబాయ్

  వివేక్ ఒక్కవారంలో దుబాయ్ వెళ్లాల్సి ఉంది. భార్యతో కలిసి దుబాయ్ వెళ్లడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుని తేనీ జిల్లాలో కురంగణి ప్రాంతంలో ట్రెక్కింగ్ చెయ్యడానికి వెళ్లారు. అయితే దురదృష్టవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో వివేక్, దివ్య మంటలకు ఆహుతి అయ్యారు.

  వివేక్, దివ్య ఇంట విషాదం

  వివేక్, దివ్య ఇంట విషాదం

  వివేక్, దివ్యను సంతోషంగా దుబాయ్ పంపించడానికి వారి కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇద్దరూ దుబాయ్ కి టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. తేనీ జిల్లాలో జరిగిన అగ్నిప్రమాదంలో వివేక్ సజీవదహనం కావడం, దివ్య 90 శాతం కాలిపోయి ఆసుపత్రిలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Nine bodies found including newly married man Vivek and his friend Tamilselvan charred in Theni forest fire, IAF choppers arrive for rescue operations.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి