జయలలిత ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు, ఎన్నికల కమిషన్ ప్రకటన, డేట్ ఫిక్స్, ఢీ అంటే ఢీ!

చెన్నై: అమ్మ జయలలిత మరణంతో ఖాళీ అయిన చెన్నైలోని ఆర్ కే నగర్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికల తేదీని భారత ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులు ఈ విషయంపై చర్చలు జరిపి తునిర్ణయం తీసుకోవడంతో తమిళనాడు ప్రభుత్వం జోరుమీద ఉంది.

తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్ లఖోని ఢిల్లీలో మకాం వేసి పై అధికారులతో చర్చించారు. డిసెంబర్ 21వ తేదీన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు, డిసెంబర్ 24వ తేదీ కౌంటింగ్ నిర్వహిస్తామని భారత ఎన్నికల కమిషన్ తెలిపింది. ఆర్ కే నగర్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని సికంద్రా, పశ్చిమ బెంగాల్ లోని సంబంగ్ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు అదే తేదీలో నిర్వహిస్తున్నారు.

Tamil Nadu officer in New Delhi to decide RK Nagar by poll date

డిసెంబర్ 31వ తేదీలోగా ఆర్ కే నగర్ ఉప ఎన్నికలు నిర్వహించాలని మద్రాసు హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మద్రాసు హై కోర్టు డెడ్ లైన్ తో భారత ఎన్నికల కమిషన్ శుక్రవారం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం రెండాకుల చిహ్నం సొంతం చేసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం జోరుమీద ఉన్నారు.

ఆర్ కే నగర్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తమిళనాడు ప్రభుత్వం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నది.

ఆర్ కే నగర్ లో పోటీ చెయ్యడానికి ప్రధాన ప్రతిపక్షం డీఎంకే పార్టీ కసరత్తులు చేస్తున్నది. అన్నాడీఎంకే పార్టీ నుంచి శాస్వతంగా బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ సైతం ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+