రజనీకాంత్‌తో ఆయన భేటీ: మతలబు ఏమిటి?
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో ఇటీవల తమిళనాడు రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడిగా నియమితులైన సీనియర్ నేత తిరునావుక్కరస్ భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. దీనివల్ల తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందా అనే చర్చ ముమ్మరంగా సాగుతోంది.
అయితే చిరకాలంగా రజనీతో స్నేహం వల్లే ఆయన్ని కలుసుకున్నానని, ఇందుకు ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తిరునావుక్కరసర్ ప్రకటించారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తిరునావుక్కరసర్ పలువురు రాజకీయ పార్టీల నేతలను మర్యాదపూర్వకంగా కలుసుకుంటున్నారు. అదేవిధంగా గురువారం ఉదయం ఎంజీఆర్ కళగం నేత ఆర్‌బీ వీరప్పన్, సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కూడా తిరునావుక్కరసర్ కలుసుకున్నారు.

గంటపాటు రజనీతో భేటీ అయ్యారు. అనంతరం సత్యమూర్తిభవన్‌కు వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రప్రభుత్వం నాలుగు వారాల్లో కావేరి నదీజలాల సమస్యపై కమిటీని ఏర్పాటు చేయాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చట్టప్రకారం చర్యలు చేపట్టి కావేరి నదీ జలాల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు
ఈ వ్యవహారంలో అందరూ ఐకమత్యంగా వుండాలని, మనమంతా దేశ పౌరులమని గుర్తించుకోవాలన్నారు. రజనీ విషయానికొస్తే మా మధ్య 40 ఏళ్ల స్నేహబంధం ఉందని ఆయన అన్నారు. కబాలి చిత్రం విజయం సాధించడంతో శుభాకాంక్షలు తెలియజేడానికే భేటీ అయ్యాను తప్ప మరెలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నారు. తమ మధ్య రాజకీయాల ప్రస్తావనే రాలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications