Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..!

తమిళనాడు (tamil nadu)లో అసెంబ్లీ ఎన్నికలకు మరో 10 రోజల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాడోపేడో తేల్చుకునేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు విజయ్ పార్టీ టీవీకే కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు తాజాగా వెలువడుతున్న సర్వేల్లో అయితే డీఎంకే కూటమి లేదా అన్నాడీఎంకే కూటమి గెలుస్తాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. విజయ్ (vijay) పార్టీ టీవీకేకు ఏ సర్వే కూడా పట్టుమని 10 సీట్లు కూడా ఇవ్వట్లేదు.

ఈ నేపథ్యంలో విజయ్ ఇప్పుడు తుది ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటివరకూ తాను చేస్తున్న ప్రచారానికి తోడు, అభ్యర్ధుల ప్రచారాలకు తోడు, తమ విక్టరీ లీగ్ వాలంటీర్లకు తాజా టాస్క్ ఇచ్చారు. పోలింగ్ బూత్ కన్వీనర్లు, సహచరులుగా మాతో పాటు ఈ ప్రయాణంలో పాలుపంచుకోవడానికి విక్టరీ లీగ్‌లో చేరిన సభ్యులు, స్నేహితులు, లీగ్‌పై అపారమైన ప్రేమ ఉన్న మిత్రులు-మీరందరూ క్షేత్రస్థాయిలోకి అడుగుపెట్టి ఓ పని చేయాలని పిలుపునిచ్చారు.

Tamil Nadu Polls Vijay s Final Call to Action for Victory League Volunteers to Secure People s Rule

రాబోయే పది రోజులలో, మీకు అనుకూలమైన సమయాలలో ఉదయం, సాయంత్రం వేళల్లో, మీలో ప్రతి ఒక్కరూ నివసించే ప్రాంతాలలో ఇంటింటికీ వెళ్లి, మన సొంత ప్రజలైన తమిళనాడు ప్రజల్ని ప్రతిరోజూ ముఖాముఖిగా కలవాలన్నారు. ఈల గుర్తుకు ఓటు వేసి మన లీగ్ అభ్యర్థులకు అనుకూలంగా ఓటు వేయమని వారికి విజ్ఞప్తి చేయాలన్నారు. ఈ క్షేత్రస్థాయి పనిలో స్వచ్ఛంద సేవకులుగా పాలుపంచుకోవాలని వారిని ఆప్యాయంగా అభ్యర్థిస్తున్నట్లు ట్వీట్ చేశారు.

Tamil Nadu Polls Vijay s Final Call to Action for Victory League Volunteers to Secure People s Rule

రాష్ట్ర, జిల్లా లీగ్ నిర్వాహకులు న లీగ్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంపూర్ణ సహకారం అందించాలన్నారు. అందరినీ ఆలింగనం చేసుకుని ఎన్నికల కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ ఎన్నిక కేవలం మన కోసం మాత్రమే కాదని, ఒక గొప్ప మార్పు కోసం, ఒక తరానికి సంబంధించిన ఎన్నిక అని వివరించాలని కోరారు. నిస్వార్థ కృషి చేసి మన విజయయాత్రకు బలాన్ని చేకూర్చాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని స్థాపించే ఈ పోరాటంలో, తమిళనాడు రాష్ట్రమంతా ఒకే విజయయాత్రగా ఏకమై నిజమైన ప్రజాపాలనను నెలకొల్పుతుందన్నారు. విజయం ఖాయం అంటూ విజయ్ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+