Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం మీద పోటీ చేస్తున్న పక్కరాష్ట్రం పధ్మరాజన్, ఎలక్షన్ కింగ్, కోటీ ఖర్చు, డిపాజిట్ !

బెంగళూరు/చెన్నై: అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలు అయినా పోటీ చెయ్యడానికి ఓ వ్యక్తి సిద్దంగా ఉంటాడు. అయితే చిన్నాచితకా వ్యక్తుల మీద పోటీ కాదు. ఏకంగా దేశవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుల మీద మాత్రమే ఆయన పోటీ చేస్తుంటారు. ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రుల మీద పోటీ చేసి ఓడిపోతున్నా ఆయన మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు మే 10వ తేదీ జరగనున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వెయ్యడానికి సిద్దం అవుతున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ పార్టీ అభ్యర్థులతో పాటు కొందరు స్వతంత్ర పార్టీ అభ్యర్థులు సిద్దం అవుతున్నారు.

 K. Padmarajan is contesting against Karnataka CM Basavaraj

అయితే కర్ణాటకతో ఏమాత్రం సంబంధం లేదని వ్యక్తి కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీ చెయ్యడానికి సిద్దం అయ్యారు. తమిళనాడులోని సేలం జిల్లా మెట్టూరులో నివాసం ఉంటున్న కే. పధ్మరాజన్ అనే వ్యక్తి శింగ్లావిలో కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద పోటీ చెయ్యడానికి బెంగళూరులో గురువారం స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.

1988 నుంచి కే. పధ్మరాజన్ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి నామినేన్లు వెయ్యడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి నేటి వరకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినా, చివరికి లోక్ సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు జరిగినా ప్రముఖుల మీద పోటీ చేసి చిత్తుచిత్తుగా ఓడిపోతున్నా ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.

మాజీ ప్రధాన మంత్రులు, బీజేపీ నేత అటల్ బిహారి వాజ్ పేయి, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్, తమిళనాడు మాజీ సీఎం కురుణానిధి, ఆ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి జే. జయలలిత మీద కే. పధ్మరాజన్ పోటీ చేసి ఓడిపోయారు. 2019లో కేరళలోని వాయినాడ్ లో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీ మీద కే. పధ్మరాజన్ పోటీ చేసి ఓడిపోయారు.

2018లో కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీద చాముండేశ్వరి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన పధ్మరాజన్ ఓడిపోయారు. రాజకీయాల్లో ఆరితేరిన వారి మీద పోటీ చేస్తున్న కే. పధ్మరాజన్ ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు పధ్మరాజన్ 234 సార్ల ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్లు కోల్పోయారు.

 K. Padmarajan is contesting against Karnataka CM Basavaraj

మెట్టూరులో సెకండ్ హ్యాండ్ టైర్లు రీబెల్ట్ చేసే సొంత ప్లాంట్ పెట్టుకుని వ్యాపారం చేస్తున్న కే. పధ్మరాజన్ ఎక్కడ ఎన్నికలు జరిగినా నేను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్నాడు. నామినేషన్ వెయ్యడానికి రూ. 5, 000, ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి రూ. 10, 000 డిపాజిట్ చెల్లిస్తున్నానని, ఇప్పటి వరకు ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి రూ. 1 కోటీ రూపాయలు ఖర్చు చేశానని కే. పధ్మరాజన్ అంటున్నారు.

 K. Padmarajan is contesting against Karnataka CM Basavaraj

ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి తాను చేసిన ఒక కోటీ రూపాయల డబ్బుల్లో ఒక్కరూపాయి కూడా వెనక్కి తిరిగిరాలేదని, ఇప్పటి వరకు తనకు 1, 890 ఓట్లు పడ్డాయని, అదే చాలు అని పధ్మరాజన్ గర్వంగా చెప్పుకుంటున్నాడు. పధ్మరాజన్ కుమారుడు ఎంబీఏ పూర్తి చేసి మెట్టూరులోనే డిజిటల్ సేవా కేంద్రం ఔట్ లెట్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు.

ఎన్నికల కింగ్ గా పేరు తెచ్చుకున్న పధ్మరాజన్ అత్యంత విఫలమైన నాయకుడిగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నికల్లో ఎక్కువ సార్లు పోటీ చేసిన వ్యక్తిగా తన పేరు లిమ్కా రికార్డు బుక్ లో తన పేరు నమోదు అయ్యిందని ఎన్నికల కింగ్ కే. పధ్మరాజన్ గర్వంగా చెప్పుకుంటున్నారు. మొత్తం మీద ఈసారి కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ మీద పధ్మరాజన్ పోటీ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+