తిరుచ్చిలో 'అమ్మ సిమెంట్' పథకం.. జనవరి 10కల్లా రాష్ట్రం మొత్తం...

చెన్నై: తమిళనాడులో మరో పథకం ప్రారంభమైంది. 'అమ్మ సిమెంట్' పేరుతో కొత్త పథకాన్ని సోమవారం తమిళనాడు ప్రభుత్వం తిరుచ్చిలో ప్రారంభించి, జనవరి 10కల్లా రాష్ట్రం మొత్తం విస్తరించనుంది. ఈ పథకం ద్వారా తమిళనాడులోని పేదలకు భారీ రాయితీ, తక్కువ ధరకే సిమెంట్ లభిస్తుంది.

పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

అమ్మ సిమెంట్ పథకం కింద ఒక్కో బస్తా రూ. 190లకు లభిస్తుంది. ఈ మేరకు ప్రైవేటు ఉత్పత్తిదారుల నుంచి రెండు లక్షల టన్నుల సిమెంట్‌ను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ పథకానికి నోడల్ ఏజెన్సీగా తమిళనాడు సిమెంట్ కార్పోరేషన్ వ్వవహారిస్తుంది.

Tamil Nadu to sell subsidised cement under Amma scheme

అన్నాడీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సెప్టెంబర్ 29, 2014న 'అమ్మ సిమెంట్' పథకాన్ని తీసుకురానున్నట్లు ప్రకటించింది. అమ్మ బ్రాండ్ కింద ఇప్పటికే రాష్ట్రంలో పేదలకు పలు సంక్షమే పథకాలను ప్రారంభించింది.

అమ్మ బ్రాండ్ కింద అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలు ప్రజలకు మరింతగా చేరువవడంతో తాజాగా 'అమ్మ సిమెంట్' పథకాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించింది. జయలలిత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పేదలు, మధ్య తరగతి ప్రజల కోసం అమ్మ పేరిట పలు పథకాలను ప్రారంభించారు. అమ్మ క్యాంటిన్ లు, అమ్మ మెడికల్స్, అమ్మ వాటర్, అమ్మ కూరగాయలతోపాటు పలు పథకాలను ఇప్పటికే ప్రభుత్వం ప్రారంభించింది.

సిమెంట్ బస్తా ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో పేద మధ్య తరగతి వర్గాలు ఇల్లు కట్టుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆయా వర్గాల వారికి తక్కవ ధరకే సిమెంట్ బస్తా అందించాలనే ఉద్దేశ్యంతో జయలలిత అమ్మ సిమెంట్ పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రకటించారు. అమ్మ సిమెంట్ దుకాణాల ద్వారా బస్తా సిమెంట్‌ను రూ.190కే విక్రయించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+