పాము కరిచిన మేక మాంసం తిని 17 మందికి అస్వస్థత

దాన్ని కోసి మాంసం వండుకుని తిన్న తర్వాత ఆస్వస్థతకు గురయ్యారు. వారిని అస్పత్రిలో చేర్చారు. ఫుడ్ పాయిజన్ వల్లనే వారు అస్వస్థకు గురయ్యారని అనుకున్నామని, అయితే వారు తిన్న మేకను పాము కరిచిందనే విషయాన్ని గ్రామస్థులు తెలపడంతో తగిన విధంగా చికిత్స చేస్తున్నామని వారన్నారు.
మేకను పాము కరిచిందని గ్రామస్థులు చెబుతున్నారని, అది నిజమో కాదో తెలియదని, 17 మందికి చికిత్స చేసి ఇంటికి పంపించామని వారు చెప్పారు. సంఘటన గురించి తమకు తెలుసునని, అయితే తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని, అందువల్ల తాము ఏమీ చెప్పలేమని తిరుత్తని పోలీసులు అన్నారు.
విషరహిత ర్యాట్ స్నేక్స్ తిరుత్తనిలో ఎక్కువగా ఉంటాయని, వ్యవసాయ క్షేత్రాలు చాలా ఉండడం వల్ల ఆ రకం పాములు చాలా ఉంటాయని అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications