డిఎంకే సభ్యుల సస్పెన్షన్: మళ్లీ షాకిచ్చిన స్పీకర్
చెన్నై: రెండు రోజుల క్రితం తమిళనాడు అసెంబ్లీలో సస్పెన్షన్‌కు గురైన డీఎంకే ఎమ్మెల్యేల పైన సస్పెన్షన్ ఎత్తివేసేది లేదని స్పీకర్ ధనపాల్ శుక్రవారం నాడు స్పష్టం చేశారు. సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవాలంటూ డీఎంకే సభ్యులు పిటిషన్ పెట్టుకున్నారు.
దీనిపై అతను స్పందించారు. సస్పెన్షన్ ఎత్తివేయాలనే పిటిషన్‌ను ఆయన తిరస్కరించారు. బుధవారం అసెంబ్లీలో డీఎంకే ఎమ్మెల్యేలు గందరగోళ పరిస్థితులు సృష్టించడంతో వారిని వారం పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ఆ రోజు చాలా సహనంగా వ్యవహరించానని కాని, వారిపై కఠినంగా చర్యలు తీసుకోక తప్పలేదని స్పీకర్ చెప్పారు. గురువారం వారి పిటిషన్‌ను తిరస్కరించిన స్పీకర్ శుక్రవారం మరోసారి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకునేది లేదని స్పష్టంచేశారు.












Click it and Unblock the Notifications