Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అక్రమ సంబంధం, ప్రముఖ నటి ఆత్మహత్యాయత్నం, కుమార్తెకు భర్త ఫ్యామిలీ టార్చర్, మరోనటి కారణం !

చెన్నై: భర్త నుంచి ఫోన్ రావడంతో ఆయనతో మాట్లాడిన తమిళ బుల్లితెర ప్రముఖ నటి తరువాత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. తనను. తన కుమార్తెను భర్త, అతని కుటుంబ సభ్యులు టార్చర్ పెడుతున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని నటి డెత్ నోట్ రాసి పెట్టింది. తన భర్తకు మరో నటితో అక్రమ సంబంధం ఉందని, అందుకే మాకు వేధింపులు ఎక్కువ అయ్యాయని, తాను ఆత్మహత్య చేసుకున్న తరువాత తన కుమార్తెను ఇబ్బందులకు గురి చెయ్యకూడదని భర్తకు, పోలీసులకు మనవి చేస్తూ ఆమె డెత్ నోట్ రాసి పెట్టడం కలకలం రేపింది.

ఇద్దరూ నటులే

ఇద్దరూ నటులే

చెన్నైలోని తిరువాణ్మయూర్ కు చెందిన జయశ్రీ, ఈశ్వర్ దంపతులు ఇద్దరూ తమిళ టీవీ సీరియల్ నటులే. జయశ్రీ, ఈశ్వర్ దంపతులకు ఓ కుమార్తె ఉంది. ప్రముఖ తమిళ టీవీ సీరియల్స్ లో జయశ్రీ, ఈశ్వర్ నటిస్తున్నారు. జయశ్రీ, ఈశ్వర్ దంపతుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.

నటితో భర్తకు అక్రమ సంబంధం !

నటితో భర్తకు అక్రమ సంబంధం !

తన భర్త ఈశ్వర్ కు వేరే నటితో అక్రమ సంబంధం ఉందని, నిత్యం తనకు అదనపు కట్నం కావాలని ఆయన వేధింపులకు గురి చేస్తున్నాడని, తన భర్తకు ఆయన కుటుంబ సభ్యుల మద్దతు ఉందని ఆరోపిస్తూ జయశ్రీ అడయార్ పోలీస్ స్టేషన్ లో, చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ కేసులు విచారణలో ఉండటంతో జయశ్రీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.

బాధితులను పరామర్శించి !

బాధితులను పరామర్శించి !

చెన్నైలోని వండలూరు ప్రాంతంలో గుడిసెలు దగ్గం అయ్యాయి. అక్కడి బాధితులను పరామర్శించడానికి నటి జయశ్రీ వెళ్లారు. బాధితులను పరామర్శించి కారులో తిరిగి తిరువాణ్మయూర్ వెలుతున్న సమయంలో జయశ్రీకి ఆమె భర్త ఈశ్వర్ ఫోన్ చేశాడు. భర్త ఈశ్వర్ తో ఫోన్ లో మాట్లాడిన జయశ్రీ రగిలిపోయింది.

కారులో నిద్రమాత్రలు మింగేసి !

కారులో నిద్రమాత్రలు మింగేసి !

ఇంటికి వెలుతున్న సమయంలో మార్గం మధ్యలో జయశ్రీ ఓ మెడికల్ షాప్ లో నిద్రమాత్రలు తీసుకుంది. కారులో వెలుతున్న సమయంలో నిద్రమాత్రలు మింగేసిన జయశ్రీ కారు నీలాంగరై సముద్ర తీరంలో వెలుతున్న సమయంలో మైకంతో పక్కకు ఒరిగిపోయింది. జయశ్రీకి సహాయంగా వచ్చిన వ్యక్తి విషయం గుర్తించి వెంటనే ఆమెను నీలాంగరైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో చికిత్స

ఐసీయూలో చికిత్స

జయశ్రీకి వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని, ఐసీయూలో చికిత్స చేస్తున్నామని, పోలీసులకు సమాచారం ఇచ్చామని అన్నారు. పోలీసులు జయశ్రీ ఇంటిలో పరిశీలించగా అంతకు ముందే ఆమె రాసి పెట్టిన ఆరు పేజీల డెత్ నోట్ బయటపడింది.

కుమార్తెకు టార్చర్

కుమార్తెకు టార్చర్

నిత్యం మద్యం సేవించి వచ్చి తనకు. తన కుమార్తెకు భర్త ఈశ్వర్ టార్చర్ పెడుతున్నాడని జయశ్రీ డెత్ నోట్ లో వివరించింది. తాను ఆత్మహత్య చేసుకున్న తరువాత తన కుమార్తె డ్యాన్స్ నేర్చుకోకుండా అడ్డుకోరాదని, తన కుమార్తెను బాగా చూసుకోవాలని జయశ్రీ భర్త ఈశ్వర్ కు మనవి చేసింది.

తల్లి, చెల్లికి మనవి

తల్లి, చెల్లికి మనవి

తన భర్త ఈశ్వర్ కు ఆయన కుటుంబ సభ్యులు మద్దతు ఇస్తున్నారని, తన కుమార్తె జోలికి రాకుండా, ఆమె డ్యాన్స్ స్కూల్ కు వెళ్లకుండా అడ్డుకోకుండా ఉండాలని పోలీసులే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని జయశ్రీ మనవి చేసింది. తన కుమార్తెను మీరే బాగా చూసుకోవాలని నటి జయశ్రీ ఆమె తల్లి, చెల్లికి డెత్ నోట్ లో మనవి చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు జయశ్రీ భర్త ఈశ్వర్, అతని కుటుంబ సభ్యులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+