చంద్రబాబు ప్రమాణస్వీకారం నాడు వేదికపై అమిత్ షా ఎందుకు సీరియస్ అయ్యారో చెప్పిన తమిళిసై
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందర రాజన్ కు చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వేదిక పైన వార్నింగ్ ఇచ్చారా? అసలు అమిత్ షా ఆమె పైన సీరియస్ ఎందుకయ్యారు? తమిళనాట బిజెపిలో అంతర్గత కుమ్ములాట విషయంలోనే తమిళిసై పై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారా? అన్నది ప్రధానంగా జరిగిన చర్చ.
చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరైన తమిళిసై
అయితే ఈ చర్చపై తమిళిసై సౌందర రాజన్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్ అయిన తమిళిసై కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.

అమిత్ షా సీరియస్ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన తమిళిసై
వేదికపై ఆమె రాగానే అమిత్ షా ఆమెను తన వద్దకు పిలిచి మాట్లాడారు. అమిత్ షా చేసినటువంటి చేతి సంజ్ఞలు, ఆయన చూపులు ఆమెకు ఏదో సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో నేడు అసలు అమిత్ షా తనతో ఏం చెప్పారు అన్న దానిపైన తమిళిసై వివరణ ఇచ్చారు.
అమిత్ షా చెప్పింది ఇదే
అమిత్ షా తనతో పోల్ పోస్ట్ ఫాలో అప్స్ గురించి మాట్లాడారని, రాజకీయపరమైన అంశాలలో నియోజకవర్గ పనుల విషయంలో శ్రద్ధ పెట్టాలని సూచించారని, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారని పేర్కొన్నారు. ఎన్నికలలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి ఆయన ఆరా తీశారని, రాజకీయంగా యాక్టివ్ గా ఉండాలని ఆయన సూచించారని తెలిపారు.
అనవసరపు ప్రచారం అంటూ తమిళిసై పోస్ట్
అయితే వేదిక పైన ఆయనతో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం లేకపోవడం కారణంగా నేను ఎక్కువ వివరణ ఇవ్వలేకపోయానని తమిళిసై వెల్లడించారు. అనవసరపు ఊహగానాలు తప్ప ఆ వీడియోలో ఏమీ లేదని పోస్ట్ పెట్టి ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత చెన్నై సౌత్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన తమిళసై అక్కడ డిఎంకెకు చెందిన తమిజాచి తంగ పాండియన్ చేతిలో ఓటమిపాలయ్యారు.
ప్రచారానికి చెక్ పెట్టేందుకే తమిళిసై పోస్ట్
తమిళనాడు బీజేపీలో అంతర్గత పోరు నడుస్తుందని అన్నామలైకు, తమిళిసైకు అస్సలు పడడం లేదని చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వార్నింగ్ ఇచ్చారని ప్రచారం జోరుగా సాగుతుంటే ఈ ప్రచారానికి చెక్ పెడుతూ తమిళిసై క్లారిటీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications