Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తమిళ ఎన్నికల సిత్రాలు‌- సెల్ఫీకి ఎగబడ్డ అభిమాని- సెల్‌ఫోన్‌ లాక్కున్న హీరో అజిత్‌

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా కొనసాగుతోంది. చెన్నైలో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, హీరోయిన్లు, ఇతర ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇదే క్రమంలో హీరో అజిత్‌ కుమార్‌ కూడా తన భార్య షాలినితో కలిసి ఓటేసేందుకు చెన్నైలోని ఓ పోలింగ్‌ కేంద్రానికి వచ్చినప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

తన భార్య షాలినితో కలిసి చెన్నైలో ఓటేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న హీరో అజిత్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. తొలుత వారిని ఏమీ అనకుండా సెల్ఫీలు, ఫొటోలు తీసుకునేందుకు అజిత్ అవకాశం ఇచ్చారు. పోలింగ్‌ బూత్‌ ముందు క్యూ ఉన్నా సెలబ్రిటీ కావడంతో పోలీసులు ఆయన్ను పక్క నుంచి నేరుగా పోలింగ్‌ కేంద్రంలోకి తీసుకెళ్లారు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లిన తర్వాత ఓటరు స్లిప్‌ తీసుకునే సమయంలో మరోసారి ఆయన అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు.

Tamilnadu Assembly elections : Hero Ajith plucks cell phone of fan while taking photo

తాను ఓటరు స్లిప్‌ తీసుకుంటుండగా ఓ అభిమాని సెల్ఫీ కోసం పదే పదే ప్రయత్నిస్తుండటంతో హీరో అజిత్‌ అతని చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ లాక్కుని ఫ్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. అక్కడ ఎలాంటి వివాదాలు తలెత్తకుండా మౌనంగా తన ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్‌ కేంద్రం నుంచి బయటపడ్డాడు. అభిమానులు ఓటేయనీయకుండా సెల్ఫీల కోసం ఎగబడటం వల్లే హీరో అజిత్‌ ఈ సెల్‌ఫోన్‌ లాక్కున్నట్లు తెలిసింది. అయితే పోలింగ్ కేంద్రం బయటికి వచ్చాక అభిమానికి సెల్‌ఫోన్ ఇచ్చేసి వెళ్లినట్లు తెలుస్తోంది. అనుకోని ఈ ఘటనతో సదరు అభిమాని కూడా ఏమనలేక మౌనంగా చూస్తుండిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+