61 టీఎంసీ నీరు రావాలి: తమిళనాడు కొత్తడిమాండ్

న్యూఢిల్లీ: కావేరీ జలాల విషయంలో కర్ణాటక పోరాటం చేస్తుంటే తమిళనాడు మాకు ఇంకా నీళ్లు కావాలని డిమాండ్ చెయ్యడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. కర్ణాటక ప్రజలను మరింత రెచ్చగొట్టడానికి తమిళనాడు ప్రయత్నిస్తున్నదని వెలుగు చూసింది.

వర్షాలు లేక బెంగళూరు గ్రామీణ, మండ్య, మైసూరు జిల్లాల్లోని రైతులు పంటలు ఎండిపోయి ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ సందర్బంలో తమిళనాడు గొంతెమ్మకోర్కెలు తెరమీదకు తెచ్చింది.

కర్ణాటక నుంచి మాకు ఇంకా 61 టీఎంసీల నీరు రావాలని తమిళనాడు ప్రభుత్వం కావేరి మానటరింగ్ కమిటి ముందు డిమాండ్ చేసింది. కర్ణాటక బంద్ చేస్తున్న సందర్బంలోనే తమిళనాడు 61 టీఎంసీ నీరు కావాలని డిమాండ్ చెయ్యడంతో కన్నడిగులు మండిపడుతున్నారు.

Tamilnadu demanding 61 TMC more water from Karnataka.

కావేరి నీటి విషయంలో సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చెయ్యడంలో కర్ణాటక పూర్తిగా విఫలం అయ్యింది. కర్ణాటక విఫలం అయిన సందర్బంలోనే తమిళనాడు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలని కావేరి మానటరింగ్ కమిటి ముందు వాదిస్తున్నది.

గత సంవత్సరం తమిళనాడుకు 94 టీఎంసీ నీరు విడుదల చెయ్యాలని కావేరి మానటరింగ్ కమిటి నిర్ధారించింది. ఆ తీర్పు ప్రకారం కర్ణాటక ఇప్పటి వరకు 33 టీఎంసీల నీరు తమిళనాడుకు విడుదల చేసింది.

94 టీఎంసీల నీరులో మాకు ఇప్పటి వరకు 33 టీఎంసీల నీరు మాత్రమే వచ్చిందని, మిగిలిన 61 టీఎంసీల నీరు కావాలని తమిళనాడు పట్టుబట్టింది. ఈ విషయం తెలుసుకున్న పలుకన్నడ సంఘాలు జయలలిత దిష్టి బొమ్మను దహనం చేసి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+