బ్యాడ్ డేస్: జయ, రజనీ, కరుణ ఆసుపత్రుల్లోనే ఉన్నారు
చెన్నై: తమిళనాడులో రాజకీయ, సినీ రంగాలకు చెందిన ముగ్గురు ప్రముఖులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆముగ్గురు నాయకుల అభిమానులు ఇప్పుడు విషాదంలో మునిగిపోయారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం విషమించడంతో తమిళనాడులో విషాదచాయలు నెలకొన్నాయి.
తమ అభిమాన నాయకులుకు ఎలాంటి కీడు జరగరాదని వారి అభిమానులు ఆలయాల్లో పూజలు, ప్రత్యేక హోమాలు చేస్తున్నారు. ఆరోగ్యం కుదటపడి వారు త్వరగా ఇంటికి చేరుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు.

అమ్మ నువ్వే మాకు దిక్కు, కొలుకో తల్లీ
తమిళనాడు సీఎం జయలలితకు ఆమె సినిమా రంగంలో ఉన్నప్పటి నుంచి లక్షలాధి మంది అభిమానులు ఉన్నారు. అన్నాడీఎంకే చీఫ్ గా, తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తరువాత కోట్లాధిమంది అభిమానులు, పార్టీ కార్యకర్తలను సంపాధించుకున్నారు.ఇప్పుడు జయలలిత ఆరోగ్యం విషమించిందని తెలియడంతో వారు తల్లడిల్లిపోతున్నారు. చెన్నైలోని గ్రీన్స్ రోడ్డులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జయలలితను చూడటానికి తమిళనాడు నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆమె అభిమానులు పెద్ద ఎత్తున చెన్నైలోని అపోలో ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు.

తలైవార్ బాగుండాలి, ఆయన సినిమాల్లో ఇంకా నటించాలి
సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ కు భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కోట్లాధి మంది అభిమానులు ఉన్నారు. ఇటీవల ఆయన శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న 2.0 (రోబో-2) సినిమా షూటింగ్ సందర్బంగా మెట్ల మీద నుంచి జారిపడటంతో గాయాలైనాయి.చెన్నైలోని కేళంబాకం ఏరియాలోని చెట్టినాడ్ అనే ప్రయివేటు ఆసుపత్రిలో రజనీకాంత్ చికిత్స పొందుతున్నారు. రజనీని చూడటానికి ఇప్పటికీ ఆయన అభిమానులు ఆసుపత్రి దగ్గర వేచి ఉన్నారు. తలైవార్ రజనీకాంత్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు.

కురవృద్దుడు, డీఎంకే కార్యకర్తలకు దేవుడు
రాజకీయ జీవితంలో ఇంత వరకూ ఓటమి అనే పదం తన చరిత్రలోకి రాకుండా చూసుకున్న నాయకుడు, డీఎంకే చీఫ్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అనారోగ్యంతో చెన్నైలోని ఆల్వార్ రోడ్డులోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

కరుణానిధి
కరుణానిధి అనారోగ్యానికి గురైనారని తెలుసుకున్న అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు తీవ్రఆందోళన చెందుతున్నారు. నాన్నకు ఏమీ జరగదని ఆయన కుమారుడు, డీఎంకే కోశాధికారి స్టాలిన్ కార్యకర్తలకు సర్దిచెబుతూ వస్తున్నారు. ఇలా తమిళనాడులోని ముగ్గురు ప్రముఖులు చెన్నైలో వేర్వేరూ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండటంతో వారి అభిమానులతో పాటు దాదాపు తమిళనాడు ప్రజలు విషాదంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications