టార్గెట్ శశికళ: ఏ పదవి తీసుకున్నా ఐటీ దాడులు గ్యారెంటీ!

చెన్నై: తమిళనాడులో ఏదో జరుగుతోంది ? అంటే అవుననే అంటున్నారు అధికార పార్టీ నాయకులు. తమిళనాడులో రాజకీయంగా అత్యంత కీలకమైన స్థానంలో ఉన్న వారి మీద ఐటీ, ఈడీ అధికారుగు గురి పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇతర రాష్ట్రాల ఐటీ అధికారులు చెన్నైలో మూడు రోజుల నుంచి మకాం వెయ్యడంతో అధికార పార్టీ నాయకులు హడలిపోతున్నారు.

ఇప్పటిదాకా తమిళనాడులో ఎనిమిది మంది రాజకీయ, అధికార ప్రముఖుల మీద ఐటీ సోదాలు చకచక జరిగిపోయాయి. మూడు రోజుల క్రితం పొరుగు రాష్ట్రాల్లో ఉన్న ఐటీ అధికారులను చెన్నై పిలిపించుకున్నారు.

కేంద్ర బలగాలు సైతం అదే స్థాయిలో చెన్నైలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రముఖులు లక్షంగా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని సంకేతాలు వెలువడ్డాయి. ఐటీ అధికారులు గురి పెట్టిన ఆ నాయకులు ఎవరా ? అని అధికారి పార్టీ నాయకులు టెన్షన్ టెన్షన్ గా ఎదురుచూస్తున్నారు.

 Target sasikala natarajan: Income Tax raids in Tamil Nadu ?

ముఖ్యంగా శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి లేదా సీఎం పదవి తీసుకున్నా ఆమెను టార్గెట్ చేస్తూ ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని చెన్నై నగరంలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

జయలలిత ఇంత కాలం జీవించిన పోయెస్ గార్డెన్ లో శశికళ ఉన్నారు. అదే పోయెస్ గార్గెన్ లో శశికళను టార్గెట్ చేసుకుని ఇప్పుడు ఐటీ అధికారులు అడుగుపెట్టే అవకాశం ఉందని సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, సీఎం పదవి తీసుకున్నా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఢిల్లీ నుంచి శశికళ హెచ్చరికలు జారీ అయ్యాయని సమాచారం.

కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలే శశికళ భవిష్యత్తును నిర్ణయిస్తాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే శశికళకు కేంద్ర ప్రభుత్వంతో పెద్దగా సంబంధాలు లేవని, అందువలన ఆమె ఏ పదవి తీసుకోకుండా ఉంటే చిన్నమ్మకే మంచిది అని అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు అంటున్నారు.

తమిళనాడులో ఒక్క కుటంబం ప్రజాస్వామిక పద్దతిలో అధికారాన్ని సొంతం చేసుకోవడానికి అవకాశం ఇవ్వరాదని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత చెప్పారు.

శశికళను మినహాయిస్తే ఆమె కుటుంబ సభ్యులను జయలలిత దగ్గరకు రానివ్వలేదు. అయితే అమ్మ మరణించిన తరువాత శశికళ భర్త నటరాజన్, వారి దగ్గరి బంధువులు దినకరన్, శివకుమార్, ఇళవరసి, దివాహరణ్ ఇప్పుడు తెరమీదకు వచ్చి రంగంలోకి దిగి మొత్తం అన్నీ వారే చూసుకుంటున్నారు. వారి మీద కేంద్రం నిఘా వేసిందని అన్నాడీఎంకే నాయకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+