శుభవార్త: 20 లక్షల వరకు గ్రాట్యుటీపై ట్యాక్స్ మినహయింపు?
Recommended Video

న్యూఢిల్లీ: రానున్న బడ్జెట్ సమావేశాల్లో గ్రాట్యుటీ సవరణ బిల్లు 2017 పాసయ్యే అవకాశం ఉంది.ఈ బిల్లు పాసైతే సుమారు 20 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ప్రస్తుతానికి ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఏళ్ల పాటు సర్వీసు ఉన్న కార్మికులు పది లక్షల వరకు గ్రాట్యుటీకి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.

అయితే దీన్ని రూ20లక్షలకు పెంచాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఈ మేరకు గ్రాట్యుటీ సవరణ బిల్లు 2017 ను ప్రవేశపెట్టింది. ఈ బిల్లు రానున్న బడ్జెట్ సమావేశాల్లో పాస్ అయ్యే అవకాశం లేకపోలేదు.
సంఘటిత రంగంలో పని చేసే కార్మికులకు గ్రాట్యుటీ కింద సుమారు 20 లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా చేయాలని చట్ట సవరణకు పూనుకొంది.
గత నెలలోనే పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు.కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ లోక్‌సభలో ఈ బిల్లును గత ఏడాది డిసెంబర్ 18న, ప్రవేశపెట్టారు.
ప్రతి ఏటా 15 రోజుల వేతనాన్ని బేసిక్ వేతనం ఆధారంగా నిర్ణయిస్తారు. అయితే ఇది పది లక్షల లోపుగా ఉండేలా గతంలో నిబంధన ఉండేది. కానీ, ప్రస్తుతం దాన్ని రూ. 20 లక్షలలోపుగా చేయాలని కేంద్రం ప్రతిపాదించింది.7వ, వేతన సంఘం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యూటీ పరిమితిని రూ20 లక్షలకు పెంచాలని సూచించింది.












Click it and Unblock the Notifications