శశికళ ఎఫెక్ట్, ఇద్దరివీ సీఎం ఊహలు: 'జగన్‌కు జైలు భయం, అది అదనం'

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతలు ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు.

చంద్రబాబు నుంచి..

చంద్రబాబు నుంచి..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి టిడిపి నేతలు, నాయకుల వరకు శశికళకు జైలు శిక్షతో జగన్‌కు ముడిపెడుతున్నారు. రూ.66 కోట్ల అక్రమాలకే నాలుగేళ్ల జైలు శిక్ష పడితే.. రూ.లక్ష కోట్లు దోచుకున్న వారికి ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందని స్వయంగా చంద్రబాబు పరోక్షంగా జగన్‌ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఏ2 శశికళకే..

ఏ2 శశికళకే..

ఏ2 శశికళకు అంత శిక్ష పడితే ఏ 1 జగన్‌కు మరెంత పడుతుందని టిడిపి నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బోండా ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. చట్టం నుంచి ఎప్పటికైనా ఎవరూ తప్పించుకోలేరని వ్యాఖ్యానిస్తున్నారు. తద్వారా ఎప్పటికైనా జగన్ జైలుకు వెళ్లక తప్పదని వారు చెబుతున్నారు.

ముఖ్యమంత్రి కలలు

ముఖ్యమంత్రి కలలు

జగన్ కూడా శశికళ లా ముఖ్యమంత్రి అయిపోతానని కలలు కంటున్నార‌ని, అవి ఏనాటికీ నెరవేరవని టిడిపి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ కేసు, శ‌శిక‌ళ కేసు ఒకలాంటివేన‌ని, ఆయ‌న‌కూ శిక్ష తప్పద‌న్నారు.

జగన్‌కు 420 అదనం

జగన్‌కు 420 అదనం

కేసు తీవ్రత దృష్ట్యా ఆయ‌న‌కు అంత‌కంటే పెద్ద శిక్ష ఖాయమ‌ని చెప్పారు. శశికల డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసినట్లే జగన్ ఏర్పాటు చేశార‌ని, శశికళపై ఉన్న కేసులతోపాటు జగన్‌కు 420 కేసు అదనమని పేర్కొన్నారు. త్వరలో జగన్‌కు శిక్ష పడటం ఖాయమని చెబుతున్నారు.

జగన్‌కు భయం

జగన్‌కు భయం

అక్రమాస్తుల కేసులో జగన్ ఆంధ్ర శశికళ అని, జయలలిత అక్రమాస్తుల కేసులో వచ్చిన తీర్పు రాజకీయ నాయకులకు చెంప పెట్టు అని, జగన్‌కు అక్రమాస్తుల కేసులో శిక్ష ఖాయమని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు. శశికళ తీర్పుతో జగన్‌కు వణుకు పట్టుకుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party leaders are targeting YSR Congress Party chief YS Jaganmohan Reddy as AIADMK chief Sasikala went jail in DA case.
Please Wait while comments are loading...