వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విద్యార్థులకి బ్లూఫిలిమ్ చూపించిన టీచర్, లేఖ రాసి వ్యక్తి ఆత్మహత్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

మధుర: పాఠశాల విద్యార్థులకు నీలి చిత్రాలు చూపించిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో జరిగింది. మధురలోని కృష్ణా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ కాలనీలో ఉన్న ఓ పాఠశాలలోని ఉపాధ్యాయుడు జితేంద్ర గౌతమ్ విద్యార్థులకు తన మొబైల్ ఫోన్లో నీలి చిత్రాలు చూపించాడు.

పాఠశాల ప్రిన్సిపల్ అర్జెంట్ పని మీద బయటకు వెళ్లినప్పుడు అతను ఈ పనికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకు వెళ్లారు. చుట్టు పక్కల వారు, విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఆ ఉపాధ్యాయుడిని చితకబాదారు.

Teacher arrested for showing blue film to children

అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు. అదే సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్న పాఠశాల ప్రిన్సిపల్ వెంటనే తిరిగి వచ్చాడు. అతను పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పాఠశాల ప్రిన్సిపల్ ఊర్మిలా శర్మ ఫిర్యాదు మేరకు కేసు పెట్టామని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్పారు.

తనను తాను బలిచ్చుకున్న వ్యక్తి

ఉత్తర ప్రదేశ్‌లో ఓ యాభై ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అరవింద్ కుమార్ ఓఝా అనే వ్యక్తి ఉజౌలి గ్రామానికి చెందినవాడు. ఇది బదల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోకి వస్తుంది. అతనికి భూమి సంబంధ వివాదాలు ఉన్నాయి. ఈ విషయమై అతను పలుమార్లు అధికారులకు దరఖాస్తు పెట్టుకున్నాడు.

అది చాలాకాలంగా పెండింగులో ఉండిపోయింది. ఇటీవలే అతను జిల్లా అధికారికి లేఖ రాశారు. డిసెంబర్ 12వ తేదీ లోపు ఈ సమస్యను తీర్చకుంటే ఊరి బయట ఉన్న గుడి ఎదుట బలి ఇచ్చుకుంటానని అందులో పేర్కొన్నాడు. దాని పైన విచారణ జరుగుతోంది. అంతలోనే అతను కాల్చుకున్నాడు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

English summary
A teacher of a school was arrested today for allegedly showing blue film to children in Ambedkar colony falling under Krishna Nagar police station limits here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X