విద్యార్థినిపై టీచర్ వేధింపులు: రేప్ కేసులో ఇద్దరి అరెస్ట్

Teacher sexually harasses minor in Bhopal
భోపాల్: విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు తన బాధ్యతను మరిచి పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక గత కొద్ది రోజులుగా పాఠశాలకు వెళ్లడం మానేసింది. భయాందోళనకు గురైన బాలిక ఈ విషయం గురించి కుటుంబ సభ్యులకు కూడా తెలపలేదు. తన తోటి విద్యార్థినికి ఘటన గురించి తెలపడంతో ఆమె ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

జనవరి 26న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ సమీపంలోని మనకున్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకుు నిందితుడు నరేంద్ర శర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు నరేంద్ర శర్మ తరచూ మద్యం తాగే పాఠశాలకు వచ్చేవాడని పోలీసులు చెప్పారు.

మైనర్ బాలికపై రేప్: ఇద్దరు రిమాండ్

మైనర్ బాలిక(11)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో గుజరాత్‌లోని జాంనగర్ కోర్టు ఇద్దరు నిందితులకు ఎనిమిది రోజుల రిమాండ్ విధించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితులు భోల గుడ్వాడియా(20), రమేష్ గుడ్విడియా(19)లను ధ్రోల్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

ఈ ఇద్దరు నిందితులోపాటు మరో ముగ్గురు నిందితులు మార్చి 12న బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+