పని చేయకపోతే నా కొడుకు కాలర్ పట్టుకుని నిలదీయండి..

చింద్వారా : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం సీఎం కమల్‌నాథ్ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చింద్వారా నుంచి కొడుకు నకుల్ తొలిసారి పోటీ చేస్తుండటంతో ఆయన ఆ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో తన కొడుకు మాటతప్పితే అతని కాలర్ పట్టుకుని నిలదీయండన్నారు కమల్‌నాథ్.

ప్రచారంలో భాగంగా చింద్వారాతో తనకున్న నాలుగు దశాబ్దాల అనుబంధాన్ని కమల్‌నాథ్ గుర్తు చేసుకున్నారు. అక్కడి ప్రజల ప్రేమ, ఆప్యాయతలతోనే తానీ స్థాయికి ఎదిగానని, ఈ బాధ్యతలను ఇప్పుడు తన కుమారుడిని అప్పగిస్తున్నానని అన్నారు. చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి తొమ్మిదిసార్లు ప్రాతినిధ్యం వహించిన కమల్‌నాథ్ ఈసారి కొడుకు కోసం ఆ స్థానాన్ని వదులుకున్నారు.

Tear My Sons Clothes, Take Him To Task : Kamalnath

ఎన్నికల ర్యాలీ సందర్భంగా సీఎం కమల్‌నాథ్ బీజేపీపై ఘాటు విమర్శలు చేశారు. ప్రధాని మోడీ, మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ ప్రజల్ని మభ్యపెట్టడం మినహా చేసిందేమీలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+