Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గాజాపై కన్నీళ్లు.. హిందువుల చావుపై మౌనమా?: సినీ తారల ఆగ్రహం

బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు, అమానుష హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల 30 ఏళ్ల హిందూ యువకుడు దీపు చంద్ర దాస్‌ను గుంపుగా వచ్చి అత్యంత క్రూరంగా కొట్టి.. చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసిన ఘటనపై భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ తారలు తీవ్రంగా స్పందించారు.

జాన్వీ కపూర్ భావోద్వేగ పోస్ట్
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఈ ఘటనపై ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు. దీపు చంద్ర దాస్ హత్యను 'అమానవీయం', 'కసాయి చర్య'గా ఆమె అభివర్ణించారు. "బంగ్లాదేశ్‌లో జరుగుతున్నది బహిరంగ ఊచకోత. ఈ దారుణమైన మాబ్ లించింగ్ వీడియో చూసిన తర్వాత కూడా మీకు రక్తం మరగకపోతే, ఆ కపటత్వమే మనల్ని నాశనం చేస్తుంది. ప్రపంచంలోని ఏ మూలనో ఏదో జరుగుతుందని కన్నీళ్లు పెట్టే మనం.. మన కళ్లముందే మన సోదరులను సజీవ దహనం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉంటున్నాం?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు.

Tears for Gaza Silence on Hindu Killings Indian Film Stars Speak Out on Bangladesh Violence

సీనియర్ నటి జయప్రద ఆవేదన
మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రద ఈ ఘటనపై స్పందిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. "ఒక మనిషిని ఇంత దారుణంగా ఎలా చంపగలరు? ఇది కేవలం హింస మాత్రమే కాదు, సనాతన ధర్మం, హిందుత్వంపై జరుగుతున్న దాడి. మన సోదరీమణుల గౌరవంపై దాడులు జరుగుతున్నాయి, దేవాలయాలు కూల్చివేస్తున్నారు. మనం ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలి?" అని ఆమె ప్రశ్నించారు.

'హిందువులారా మేల్కొనండి': కాజల్ అగర్వాల్ పిలుపు
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ క్రూరత్వాన్ని ఖండిస్తూ ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. "హిందువులారా మేల్కొనండి.. మీ మౌనం మిమ్మల్ని కాపాడదు" అంటూ ఆమె హిందువుల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగాలని ఆమె డిమాండ్ చేశారు.

మనోజ్ జోషి ఘాటు వ్యాఖ్యలు
ప్రముఖ నటుడు మనోజ్ జోషి అంతర్జాతీయ సమాజం, సెలబ్రిటీల ద్వంద్వ వైఖరిని ఎండగట్టారు. "గాజా లేదా పాలస్తీనాలో చిన్న ఘటన జరిగినా అందరూ ముందుకొస్తారు. కానీ బంగ్లాదేశ్‌లో ఒక హిందువును దారుణంగా చంపితే ఎవరూ నోరు మెదపరు. ఈ మౌనం చాలా బాధాకరం" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఏమిటీ ఘటన?
ఢాకాకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని మయమన్‌సింగ్‌లో బట్టల ఫ్యాక్టరీలో పనిచేసే దీపు చంద్ర దాస్‌ను ఒక గుంపు విచక్షణారహితంగా కొట్టింది. అనంతరం అతడిని వివస్త్రను చేసి చెట్టుకు కట్టేసి నిప్పంటించారు. ఆ సమయంలో అక్కడున్న గుంపు కేకలు వేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేయడం వీడియోలలో రికార్డ్ అయింది. ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి అమృత్ మండల్ (29) అనే మరో హిందూ యువకుడిని కూడా గుంపుగా వచ్చి కొట్టి చంపినట్లు వార్తలు వస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+