టెక్కీలకు షాక్: అమెరికాలో 2,200 మందికి ఉద్యోగాలు:టెక్ మహీంద్రా

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అమెరికాలో ఈ ఏడాది మరో 2,300 మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్టు టెక్ మహీంద్రా కంపెనీ ప్రకటించింది. గత ఏడాది కూడ ఇదే సంఖ్యలో ఉద్యోగులను నియమించుకొంది ఆ కంపెనీ.

టెక్కీలకు షాక్: ఐటీ సెక్టార్‌కు బ్యాడ్‌న్యూస్, రూపీ దెబ్బకు టీసీఎస్ ఢమాల్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మారిన పరిస్థితుల నేపథ్యంలో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించేలా నిర్ణయాలు తీసుకొన్నారు.ఈ మేరకు వీసా నిబంధలను కఠినతరం చేయడంతోపాటు స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్ఢర్‌ను తెచ్చింది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్.

Tech Mahindra to hire over 2,000 people in US this year

దీంతో స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించేందుకు సాప్ట్‌వేర్ కంపెనీలు చర్యలను తీసుకొంటున్నాయి. ఈ మేరకు టెక్ మహీంద్రా కంపెనీ ఈ ఏడాది 2,200 మందికి అమెరికాలో నియమించుకోనున్నట్టు ప్రకటించింది.

ప్రస్తుతం అమెరికాలోని టెక్ మహీంద్రాలో 6వేల మంది ఉద్యోగులున్నారు. నాలుగేళ్ళుగా వివిధ కళాశాలల నుండి వీరిని నియమించుకొన్నారు. స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలన్న అమెరికా ప్రభుత్వ వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా టెక్ మహీంద్ర వైస్‌ప్రెసిడెంట్ లక్ష్మణన్ చిదంబరం చెప్పారు.

Good News for Techies Find Out More

టెక్కీలకు షాక్: ఐటీ కంపెనీల లాభాలు తగ్గొచ్చు, కారణమిదే!

టెక్ మహీంద్రా అమెరికాలోని 26 నగరాల్లో తన సేవలను అందిస్తోంది. సుమారు 16 డెవలప్‌సెంటర్లున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 1.17 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
IT major Tech Mahindra plans to hire around 2,200 people in the US this year, same as last year, amid the American government’s call for creation of jobs in the country.
Please Wait while comments are loading...