ఫ్లాట్‌కు రప్పించుకుని టెకీపై రేప్: పోర్న్ సైట్‌లో వీడియో, బ్లాక్ మెయిల్..

Subscribe to Oneindia Telugu
  Techie upload Private Video in Website ఫ్లాట్‌కు రప్పించుకుని టెకీపై రేప్: పోర్న్ సైట్‌లో వీడియో

  బెంగళూరు: పని ప్రదేశంలో మహిళల పట్ల లైంగిక వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. నయానో.. భయానో.. వారిని లొంగదీసుకుని బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా బెంగుళూరులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

  వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఆరిందమ్ నాథ్(28) బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. నగరంలోని ఈజిపురా ప్రాంతంలోని వివేక్ నగర్‌లో ఆరిందమ్ నివసిస్తున్నాడు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఓ 26 ఏళ్ల యువతి కూడా ఆరిందమ్ పనిచేసే సంస్థలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ గా పనిచేస్తోంది.

  Techie held for raping colleague, uploading video on porn website

  ఈ నేపథ్యంలోనే యువతిని ప్రేమ పేరుతో ఆరిందమ్ నాథ్ మోసం చేశాడు. ఓరోజు ఆమెను తన ఫ్లాట్ కు పిలిపించుకున్న ఆరిందమ్ నాథ్.. ఆమెపై అత్యాచారం చేసి దాన్ని సెల్‌ఫోన్‌తో రహస్యంగా చిత్రీకరించాడు. ఆపై ఆ వీడియోను పోర్న్ సైట్లలో అప్ లోడ్ చేస్తానని బెదిరిస్తూ పలుమార్లు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఇదే క్రమంలో డబ్బుల కోసం ఆమెను డిమాండ్ చేయగా.. అందుకు యువతి నిరాకరించింది.

  దీంతో ఆమెపై అత్యాచారం జరిపిన వీడియోను ఆరిందమ్.. పోర్న్ సైట్‌లో పెట్టాడు. ఈ ఉదంతంపై బాధిత యువతి తన స్నేహితురాళ్లతో కలిసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఐపీసీ సెక్షన్ 376, 384, 506, 66 ఈ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు.

  పోర్న్ వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన వీడియోను తొలగించారు. నిందితుడు నేరం అంగీకరించడంతో అతన్ని అరెస్ట్ చేశారు. మరోవైపు బాధిత టెకీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. ఆమె స్నేహితురాళ్లు కాపాడారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఆమె కోలుకుంటోంది.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  A 28-year-old senior software engineer with a private firm has been arrested for allegedly raping his colleague, videographing the act and uploading the video on a porn website after she stopped yielding to his blackmailing threats.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి