భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న టెక్కీ

గత కొన్ని రోజులుగా దంపతులిద్దరూ గొడవపడుతున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో సహనం కోల్పోయిన భర్త మధు తన భార్యను కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకునేందుకు పలు విధాలా ప్రయత్నించాడు. మొదట సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించగా అది ఊడిపడడంతో మరో ప్రయత్నం చేశాడు.
తన శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా అగ్గి పెట్టె దొరక్కపోవడంతో చివరకు వారు నివాసముంటున్న అపార్ట్‌మెంట్ 13వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సాఫ్ట్‌వేర్ దంపతులకు ఆరేళ్ల కుమార్తె కూడా ఉందని, ఘటన సమయంలో ఆమె తన తాతయ్య ఇంట్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications