మహిళా అథ్లెట్‌పై రేప్, మహిళను చంపిన దొంగలు

నిందితుడు చర్న్‌ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఎస్‌పి (ఖన్నా) సుశీల్ కుమార్ చెప్పారు. చెల్లె విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పందని, దీంతో తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వెళ్లారని, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.
ఇదిలావుంటే, ఢిల్లీలో దోపిడీ దొంగలు 55 ఏళ్ల మహిళను హత్య చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళ గొంతు నులిమి చంపేసి దోపిడీకి పాల్పడ్డారు. ఔటర్ ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 7 ఏరియాలో ఈ సంఘటన జరిగింది.
మంగళవారం హరచరణ్ కౌర్ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో దోపిడీ దొంగలు ప్రవేశించి, ఆమెను హత్య చేసి, దోపిడీకి పాల్పడ్డారు. మహిళ కుమారుడు, కోడలు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. స్పృహ తప్పి పడిపోయిన మహిళను అంబేడ్కర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు.












Click it and Unblock the Notifications