అభ్యంతరకర భంగిమలో పట్టుబడడంతో.. చెల్లెల్ని హత్య చేసిన సోదరులు
హర్యానా : హర్యానాలో పరువు హత్య చోటు చేసుకుంది. తోడబుట్టిన చెల్లెలు కొంతమంది యువకులతో అభ్యంతరకర భంగిమలో ఉండడాన్ని జీర్ణించుకోలేని ముగ్గురు సోదరులు ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలోని బిదాల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సొంత ఇంట్లోనే పరాయి వ్యక్తులతో కలిసి తమ చెల్లెలు ప్రీతి(17) అభ్యంతరకర రీతిలో పట్టుబడడంతో.. ముగ్గరు సోదరులు ముఖేష్, సందీప్, సోనులు ఆమెను హత్యకు చేసినట్లు ఊరి సర్పంచ్ ఓంప్రకాశ్ తెలిపారు. హత్య అనంతరం చెల్లెలి శవాన్ని దహనం చేసేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.













Click it and Unblock the Notifications