వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెహెల్కా: సుష్మాVsసిబాల్, షోమా ఇంటివద్ద హల్‌చల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెహెల్కా తరుణ్ తేజ్‌పాల్ లైంగిక వేధింపుల వివాదం కేంద్రమంత్రి కపిల్ సిబాల్, భారతీయ జనతా పార్తీ ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్‌ల మధ్య వివాదానికి దారి తీసింది. తేజ్‌పాల్‌ను ఓ కేంద్రమంత్రి కాపాడుతున్నారని సుష్మా స్వరాజ్ రెండు రోజుల క్రితం విమర్శించారు. సుష్మా ఆయన పేరు ప్రస్తావించలేదు.

అయితే సుష్మా విమర్శలపై కేంద్రమంత్రి కపిల్ సిబాల్ స్పందించారు. తనకు తెహెల్కాలో ఎలాంటి వాటాలు లేవని, కేవలం ఐదు లక్షల రూపాయల విరాళాలు మాత్రం ఇచ్చినట్లు చెప్పారు. తేజ్‌పాల్‌ను రక్షించాల్సిన అవసరం తనకు లేదని ఆయన అభిప్రాయపడ్డారు.

sushma swaraj and kapil sibal

దీనిపై సుష్మా కౌంటర్ ఇచ్చారు. తాను ఓ కేంద్రమంత్రి కాపాడుతున్నారని మాత్రమే చెప్పానని, ఎవరి పేరును ప్రస్తావించలేదని గురువారం చెప్పారు. తనకు తెహెల్కాతో ఎలాంటి సంబంధం లేదన్న సిబాల్ ఖండనలో స్పష్టత లేదన్నారు. తేజ్‌పాల్ కేసులో తాను సిబాల్ పేరును చెప్పలేదన్నారు.

షోమా ఇంటి వద్ద నిరసన

రాజీనామా చేసిన తెహెల్కా మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి ఇంటి ఎదుట బిజెపి నేత ఒకరు ఆందోళన చేశారు. ఆమె ఇంటి వద్ద ఉన్న నేమ్ బోర్డుపై పేరును చెరిపేసి అక్యూజ్డ్ అని రాశారు. పార్టీ కార్యకర్తలతో కలిసి సదరు నేత ఆందోళన చేపట్టారు. జాతీయ మహిళా కమిషన్‌కు వెళ్లడానికి బయటకు వచ్చిన షోమా చౌదరిని అడ్డుకొని నినాదాలు చేశారు.

English summary
Union minister Kapil Sibal today denied owning a single share in the Tehelka magazine and dared BJP's Sushma Swaraj to name him as the"minister" she alleged was shielding the magazine's founder Tarun Tejpal, who has been booked for rape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X