Lalu prasad yadav : లాలూకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్- వీడియో షేర్ చేసిన తేజస్వీ..
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఇవాళ సింగపూర్ లో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతోంది. ఈ ఆపరేషన్ కోసం లాలూ కుటుంబ సభ్యులంతా సింగపూర్ బయలుదేరివెళ్లారు. లాలూ భార్య రబ్రీదేవితో పాటు కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, కిడ్నీ దాత అయిన కుమార్తె రోహిణీ ఆచార్య కూడా అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో లాలూ కిడ్నీ మార్పిడి ఆపరేషన్ కు సంబంధించిన ఓ వీడియోను తేజస్వి ట్విట్టర్ లో షేర్ చేశారు.
पापा का किडनी ट्रांसप्लांट ऑपरेशन सफलतापूर्वक होने के बाद उन्हें ऑपरेशन थियेटर से आईसीयू में शिफ्ट किया गया।
— Tejashwi Yadav (@yadavtejashwi) December 5, 2022
डोनर बड़ी बहन रोहिणी आचार्य और राष्ट्रीय अध्यक्ष जी दोनों स्वस्थ है। आपकी प्रार्थनाओं और दुआओं के लिए साधुवाद। 🙏🙏 pic.twitter.com/JR4f3XRCn2
ట్విట్టర్ లో పెట్టిన ఈ వీడియోలో తేజస్వి.. కిడ్నీ దానం చేసినందుకు తన అక్క రోహిణికి ధన్యవాదాలు తెలిపారు. ఆపరేషన్ తర్వాత తండ్రి లాలూను ఆపరేషన్ థియేటర్ నుండి ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించినట్లు తేజస్వి యాదవ్ తెలిపారు. తేజస్వీ ఈ వీడియో క్లిప్‌లో ఐసీయూకి తన తండ్రి లాలూను తరలిస్తున్నప్పుడు పక్కనే ఉండి తీసుకెళ్తున్నారు. ఆయన పక్కనే తల్లి రబ్రీ దేవి కూడా ఉన్నారు.

పాపా(నాన్న) కిడ్నీ మార్పిడి ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత ఆయన్ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకి మార్చారని తేజస్వి హిందీలో ట్వీట్ చేశారు. "దాత అయిన అక్క రోహిణి ఆచార్య, లాలూ ప్రస్తుతం ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని తేజస్వీ తెలిపారు. అలాగే మీ ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలంటూ ఏడు సెకన్ల క్లిప్‌తో తేజస్వీ ఈ వీడియోను పోస్ట్ చేశారు. లాలూ ఆరోగ్యంపై ఆందోళనతో ఉన్న ఆర్జేడీ అభిమానుల కోసం తేజస్వీ ఈ వీడియోను షేర్ చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications