అదేం భాష: చానళ్ల బ్యాన్‌పై కేసీఆర్‌కు ఘాటుగా ఖట్జూ
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రసారాలను పునరుద్ధరించకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు సమస్యలు తప్పవని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, మాజీ న్యాయమూర్తి మార్కండేయ ఖట్జూ హెచ్చరించారు.
గురువారం ఓ చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు అభ్యంతరకరమన్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలని సూచించారు. మీడియా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఏబీఎన్ ఏ తప్పు చేయకపోయినా ఎందుకు ప్రసారాలను నిషేధించారని ప్రశ్నించారు.

ప్రభుత్వం ఒత్తిడితోనే ఎంఎస్‌వోలు ప్రసారాలు నిలిపివేశారని అభిప్రాయపడ్డారు. చానళ్ల ప్రసారాలు పుననరుద్ధరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్‌లోనూ ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలన్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆదేశాలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు.
మీడియా పైన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖట్జూ తీవ్రంగా ఖండించారు. అదే సమయంలో, మీడియా కూడా అభ్యంతరకరంగా ప్రసారాలు చేయడం సరికాదన్నారు. అయితే, సదరు టీవీ చానల్ ఇప్పటికే క్షమాపణలు చెప్పిందన్నారు. కేసీఆర్ తన భాషను మార్చుకోవాలన్నారు. కేసీఆర్ వాడిన భాష సరికాదని, అప్రజాస్వామికని, ముఖ్యంగా కేసీఆర్ అత్యున్నత స్థానంలో ఉన్నారని ఖట్జూ అన్నారు.
-
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా..












Click it and Unblock the Notifications