Telangana Exit Poll 2023:ఎవరీ మస్తాన్.. ఎందుకీ సర్వే కు ఇంత క్రేజ్!
సర్వేలంటే జాతీయ స్థాయి సర్వేలు, జాతీయ మీడియా చేసే సర్వేలు మాత్రమే మనకు తెలుసు. కానీ తెలుగు వ్యక్తులు, తెలుగు వారికి సుపరిచిమైన వారు చేసే సర్వేలు చాలా అరుదుగా ఉంటాయి. తెలుగు వారు సర్వే రంగంలో కీలకంగా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారు కూడా ఒక నియోజకవర్గానికో ఒక ఏరియాకో పరిమితమైన వారు కానీ, ఒక వ్యక్తి మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో తనకుంటూ ఒక ముద్రవేసుకున్నారు. సర్వే విశిష్టత, కచ్చితత్వంలో లీడర్ గా ఎదిగారు.
అవును ఆయన షేక్ మస్తాన్, ఉరాఫ్ ఆరా మస్తాన్.. ఆరా సంస్థ ఎండీ.. సీఎం కేసీఆర్ కామారెడ్డిలో ఓడిపోతారని ఎవరూ కూడా ధైర్యం చేసి చెప్పలేరు. ఓడిపోయే మంత్రుల లిస్టు చెప్పాలంటే గట్స్ ఉండాలి. గెలిచేదెవరో చెప్పాలంటే అంత యాక్యురసీ ఉండాలి. వెరసి వీటినే అభరణాలుగా అడుగులు వేస్తున్నారు ఆరా మస్తాన్. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములుపై ఆయన ప్రెడిక్షన్ ఇప్పుడు తెలుగు నేలపై మాత్రమే కాదు, జాతీయ స్థాయిలోనూ సంచలనం రెకెత్తిస్తోంది. 2009 ఎన్నికల దగ్గర్నుంచి 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజేత ఎవరో చెప్పి సత్తా చాటుకున్నారు.

ఆరా మస్తాన్ ప్రెడిక్షన్స్ పర్ఫెక్ట్
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ గాలివీస్తోందని చెప్పినా, అంతకు ముందు దుబ్బాక ఉపఎన్నికల్లో జయపజయాలను అంచనా వేసినా, గ్రేటర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దెబ్బతింటుందని చెప్పినా.. ఆయన ప్రెడిక్షన్‌కు అంతటి పర్ఫెక్షన్ ఉంది. వ్యవస్థలు నిద్రిస్తుంటే.. కొత్త చైతన్యం ఊపిరిపోసుకుంటుందంటారు. వ్యవస్థలు చేయాల్సిన పనులను వ్యక్తులు సమాజం బాగు కోసం చేస్తే వారే వ్యవస్థలుగా ఏర్పడతారు. గురజాడ అప్పారావు గారు చెప్పినట్టుగా సొంత లాభం కొంత మానుకొని.. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ స్ఫూర్తి రగిలిస్తారు. మానవసేవే మాధవ సేవ అంటూ ఈ భూమిపై తమ జన్మకు సార్థకత చేకూర్చుకుంటారు.
కొందరు మహనీయులు... అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్న కొందరు సమాజంలో మార్పు కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అలాంటి కొద్ది మందిలో ఆరా మస్తాన్ ఒకరు.. అందరిలా ఉద్యోగాలు చేయాలని.. వ్యాపారాలు చేయాలని అనుకునే మనస్తత్వం కాదాయనది. భిన్నంగా ఆలోచించే మనసత్త్వం ఆయనది. తెలుగునాట సర్వే అన్న మాట అంతగా ప్రాచుర్యంలో లేని రోజుల్లో ఆగస్త్య రీసెర్చ్ అనాలసిస్ ఏజెన్సీ ఆరాను స్థాపించి ఒక్కో మెట్టు ఎదిగారు. 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఆరా సర్వే సంస్థ అనతికాలంలోనే ఆరా పోల్స్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌గా దిగ్గజ కంపెనీలకు సమానంగా ముందడుగు వేస్తోంది.

2008లో ప్రారంభమైన ఆరా ప్రస్థానం... 2009 ఎన్నికల ఫలితాలపై తనదైన ముద్ర వేసుకొంది. అంతగా పరిచయం లేని సెఫాలజీ రంగంలో అడుగిడి...ఆరా సంస్థ అనేక రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహించి సత్తా చాటింది. ఏపీ, తెలంగాణలోనే కాదు...గుజరాత్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, తమిళనాడులో సర్వేలు నిర్వహించడమే కాదు వందుకు వంద శాతం యాక్యురెసీతో ఫలితాలను అందించింది. సర్వే వృత్తిని ఒక ప్యాషన్‌గా భావిస్తూ ముందడుగేస్తున్నారు షేక్ మస్తాన్ ఉరాఫ్ ఆరా మస్తాన్... తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలకు ఆయన ఒక మార్గదర్శి. ఏం చేస్తే గెలవవచ్చు...ఏం చేస్తే ప్రత్యర్థులను ఓడించొచ్చన్నది ఆయనకు తెలిసినంతగా పార్టీల అధినేతలకు తెలియదంటే అతిశయోక్తి కాదు.

ఎన్నో రకాలుగా సమాజంపై చెరగని ముద్ర వేశారు. సర్వే సంస్థను ఇప్పుడు జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ, ఏపీలోని 294 నియోజకవర్గాల్లో ఇంటెన్సివ్ సర్వేలు నిర్వహిస్తూ వచ్చే రోజుల్లో అధికారంలో ఉండేదెవరు? ఓడేదెవరన్నది కూడా చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఆరా సర్వేలు కండక్ట్ చేసేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుంటోంది. సెఫాలజీని వృత్తిగా మలచుకొని వందల మందికి ఉపాధి కల్పిస్తూ ఔరా అన్పించుకుంటున్నారు మస్తాన్... దేశ రాజకీయాల్లో సర్వేలు ఎలా చేస్తారో.. సర్వేల శాస్త్రీయత ఎంత అనుకునే రోజుల్లోనే... ట్యాబ్స్ ద్వారా ఎన్నికల సర్వేలు చేసి వావ్ అన్పించుకున్నారు. ఎన్నికల ఫలితాలపై ఎన్ని సర్వేలొచ్చినా ఆరా సర్వే ఎలా ఉందిరా అనుకునేంతగా ఆయన సర్వేల్లో కచ్చితత్వం ఉంటుంది. ఇక ఆరా ఫౌండేషన్‌తో అట్టడుగు వర్గాలకు, నిరుపేదలకు సాయం చేసేందుకు నేను సైతం అంటూ ముందడుగు వేస్తున్నారు షేక్ మస్తాన్ ఉరాఫ్ ఆరా మస్తాన్...












Click it and Unblock the Notifications