వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు కేసీఆర్ నో-ప్రత్యేక కమిటీ ఏర్పాటు-గెజిట్ అమలుపై నీలి నీడలు

|
Google Oneindia TeluguNews

కృష్ణా నదీపై నిర్మించిన ప్రాజెక్టుల్లో గతంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా అప్పగించాల్సిన అవుట్ లెట్లను అప్పగించేందుకు తెలంగాణ ససేమిరా అంటోంది. కృష్ణా రివర్ బోర్డుకు అప్పగించాల్సిన ఈ అవుట్ లెట్లపై ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలూ జీవోలు ఇవ్వలేదు. అయితే తెలంగాణ మాత్రం తన వైఖరిని వెల్లడించింది. అంతే కాదు గెజిట్ నోటిఫికేషన్ పై అధ్యయనానికి నీటిపారుదలశాఖ అధికారులతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీంతో తెలంగాణ అడుగుల్ని నిశితంగా గమనిస్తున్న జగన్ సర్కార్.. తుది నిర్ణయం కోసం కసరత్తు చేస్తోంది.

 తెలుగు రాష్ట్రాల జల వివాదం

తెలుగు రాష్ట్రాల జల వివాదం

తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన, నిర్మించబోతున్న ప్రాజెక్టులపై వివాదాలు నెలకొన్నాయి. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని అడ్డుకునే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో ఏకపక్షంగా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. దీంతో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేసింది. చివరికి ఏపీ ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం ఈ ప్రాజెక్టుల్ని తమ పరిధిలోకి తీసుకుంటూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఇరు రాష్ట్రాల్లో కృష్ణా నదీ ప్రాజెక్టులు రివర్ బోర్డు పరిధిలోకి తేవాల్సిన పరిస్ధితి ఏర్పడింది.

ప్రాజెక్టులు అప్పగించాలన్న కేఆర్ఎంబీ

ప్రాజెక్టులు అప్పగించాలన్న కేఆర్ఎంబీ

కృష్ణా నదీ ప్రాజెక్టులపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ కు అనుగుణంగా కృష్ణా రివర్ బోర్డు వీటిని స్వాధీనం చేయాలని ఇరు తెలుగు రాష్ట్రాలను కోరింది. తెలంగాణలోని కృష్ణా నదిపై ఉన్న 9 అవుట్ లెట్లతో పాటు ఏపీలోని 6 అవుట్ లెట్లను కూడా రివర్ బోర్డు పరిధిలోకి తీసుకునేందుకు సహకరించాలని సూచించింది. ఇందుకు రివర్ బోర్డు రెండు తెలుగు రాష్ట్రాలకు ఇవాళ్టి వరకూ గడువు ఇచ్చింది. అయినా ఇరు రాష్ట్రాలు ఇప్పటివరకూ ఈ మేరకు జీవోలు జారీ చేయలేదు. అంటే రివర్ బోర్డు ఆదేశాల్ని ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించాయి. ఈ నేపథ్యంలో రివర్ బోర్డు తీసుకునే నిర్ణయం కీలకంగా మారుతోంది.

అప్పగింతకు తెలంగాణ ససేమిరా

అప్పగింతకు తెలంగాణ ససేమిరా


రెండు తెలుగు రాష్ట్రాల్లోని 15 అవుట్ లెట్లను తమకు అప్పగించాలని గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా రివర్ బోర్డు కోరినా ఏపీ, తెలంగాణ స్పందించలేదు. తెలంగాణ అయితే నేరుగా ఏపీకి కృష్ణా ప్రాజెక్టులు అప్పగించే ప్రశ్నే లేదని తేల్చిచెప్పేసింది. విద్యుత్ ప్రాజెక్టులు లేకుండా మిగిలిన అవుట్ లెట్లను అప్పగించేందుకు సిద్ధమని చెబుతోంది. దీంతో ఇప్పుడు దీనిపై కృష్ణా రివర్ బోర్డు ఎలాంటి చర్యలు చేపట్టబోతోందన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వ స్పందన ఎలా ఉండబోతోందన్నదీ ఆసక్తి కరంగా మారింది. కృష్ణా నదీ ప్రాజెక్టుల అప్పగింత వల్ల తమకు భారీగా నష్టం జరుగుతుందని భావిస్తున్న తెలంగాణ.. అధ్యయనం పేరుతో కాలయాపన చేసేందుకు ప్రయత్నించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

 గెజిట్ అధ్యయనానికి తెలంగాణ కమిటీ

గెజిట్ అధ్యయనానికి తెలంగాణ కమిటీ


తెలంగాణ పరిధిలోని కృష్ణా నదీ ప్రాజెక్టుల అప్పగింత విషయంలో ససేమిరా అంటున్న తెలంగాణ సర్కార్ ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో జీవో జారీ చేయడానికి బదులు మరో నిర్ణయం తీసుకుంది. ఏకంగా గెజిట్ పై అధ్యయనానికి నీటి పారుదల శాఖకు చెందిన నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కమిటీ అధ్యయనం తర్వాతే తమ నిర్ణయం చెబుతామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అయితే గెజిట్ పై ఇన్నాళ్లూ మౌనంగా ఉండి ఇప్పుడు అప్పగింత సమయంలో కమిటీ ఏర్పాటు ద్వారా తెలంగాణ కాలయాపనకు ప్రయత్నిస్తోందని ఏపీ ఆరోపిస్తోంది. దీనిపై త్వరలో సీఎం జగన్ తో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని ఏపీ అధికారులు చెప్తున్నారు.

English summary
deadlock between two telugu states continued on handover of krishna river projects to krmb. telangana govt formed four member irrigation committee to counter ap's plans.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X