తెలంగాణ: షిండే, దిగ్విజయ్ సింగ్‌లతో జైరాం భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి జైరాం రమేష్ భేటీల మీద భేటీలు జరుపుతున్నారు. తెలంగాణపై జివోఎం నివేదికపై, బిల్లు ముసాయిదాపై జైరాం రమేష్ తొలుత హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. వారిద్దరు కూడా హోం శాఖ కార్యదర్శితో మాట్లాడారు. దాదాపు గంటపాటు జరిగిన సమావేశంలో హోం కార్యదర్శితో జైరాం రమేష్, సుశీల్ కుమార్ షిండే మాట్లాడారు.
ఆ తర్వాత జైరాం రమేష్ కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్‌తో సమావేశమయ్యారు. జీవోఎం నివేదికపై, తెలంగాణ బిల్లు ముసాయిదా రూపకల్పనపై శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. జివోఎం నివేదికను కోర్ కమిటీ సమావేశంలో పెట్టే అవకాశాలున్నాయి.

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నివాసంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం జరుగుతుంది. కోర్ కమిటీ సభ్యులంతా అందుబాటులో ఉన్నారు. శీతాకాలం పార్లమెంటు సమావేశాల్లో బిల్లును ప్రతిపాదించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
జివోఎం చివరి సమావేశం డిసెంబర్ 3వ తేదీన జరిగే అవకాశాలున్నాయి. తెలంగాణ ముసాయిదా బిల్లు డిసెంబర్ 4వ తేదీన కేంద్ర మంత్రి వర్గం ముందుకు వస్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతికి పంపించడం, రాష్ట్రపతి శాసనసభకు పంపించడం వంటి వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications