వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Temple: హిందూ దేవాలయం కోసం రూ. 2. 50 కోట్ల భూమిని దానం చేసిన ముస్లీం ఫ్యామిలీ, సలామ్ ఖాన్ బాయ్ !

|
Google Oneindia TeluguNews

పాట్నా: మతాల మద్య చిచ్చు పెట్టి రాజకీయ లభ్దిపొందాలని పొందాలని కొందరు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తుంటే కొందరు ప్రజలు మాత్రం వాటికి భిన్నంగా ప్రవర్థిస్తున్నారు. రాముడు అయినా, అల్లా అయినా ఒక్కటే అని ఓ ముస్లీం కుటుంబం నిరూపించింది. సాటి ప్రజలకు వంద రూపాయలు సహాయం చెయ్యడానికి వెనుకాముందు ఆలోచించే ఈ కాలంలో కోట్ల రూపాయల భూమిని వేరే మతం దేవాలయానికి ఓ కుటుంబం దానం చేసింది. వినడానికి ఆశ్చర్యం అయిన ఇది నిజం. దేశంలోనే అతి గొప్ప హిందూ దేవాలయం నిర్మించడానికి ప్రయత్నిస్తున్న హిందువులకు కోట్ల రూపాయల భూమిని దానం చేసిన ముస్లీం కుటుంబ సభ్యులు దేశంలోనే కోట్లాది మంది ముస్లీం సోదరులకు ఆదర్శంగా నిలిచారు. సుమారు రూ. 500 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటిగా ఉండాలని ఈ దేవాలయం నిర్మిస్తున్నారు.

Illegal affair: విదేశాల్లో భర్త, బెడ్ రూమ్ లో బావ, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ?, బావిలో భర్త శవం !Illegal affair: విదేశాల్లో భర్త, బెడ్ రూమ్ లో బావ, ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ?, బావిలో భర్త శవం !

 ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం

ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయం

బీహార్ లోని చంపారణ్ జిల్లాలోని కైత్వాలియా ప్రాంతంలో ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ విరాట్ రామాయణ మందిరం దేవాయలం నిర్మించాలని డిసైడ్ అయ్యారు. బీహార్ లోని పాట్నాకు చెందిన మహావీర్ మందిర ట్రస్టు ఈ దేవాలయం నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

150 ఎకరాల్లో దేవాలయం

150 ఎకరాల్లో దేవాలయం


హిందూ విరాట్ రామయణ దేవాయలం నిర్మాణానికి సుమారు 150 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఇప్పటికే దేవాలయం ట్రస్టు నిర్వహకులు 125 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 25 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ప్రపంచంలోని అతి పెద్ద దేవాలయం నిర్మాణం కోసం వాళ్ల సొంత భూమికి దేవాలయం కోసం ఇవ్వడానికి ముందుకు వచ్చారు.

రూ.2.50 కోట్ల విలువైన భూమి ఇస్తానని హామీ

రూ.2.50 కోట్ల విలువైన భూమి ఇస్తానని హామీ

దేవాలయం నిర్మిస్తున్న ప్రాంతంలో గుహవాటికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇస్తియాక్ అహమ్మద్ ఖాన్ కు చెందిన భూమి ఉంది. దేవాలయం నిర్మాణానికి రూ. 2.50 కోట్ల విలువైన భూమిని ఇస్తానని, దేవాలయం నిర్మాణం కోసం తన వంతకు సహకారం ఇస్తానని ఇస్తియాక్ అహమ్మద్ ఖాన్ దేవాయలం నిర్మిస్తున్న ట్రస్టుకు హామీ ఇచ్చారు.

అహమ్మద్ ఖాన్ చాలా గొప్పవ్యక్తి

అహమ్మద్ ఖాన్ చాలా గొప్పవ్యక్తి


చెప్పినట్లుగానే ఇటీవల కేశారియా ఉపవిబాగం రిజిస్టర్ ఆఫీసుకు చేరుకున్న ఇస్తియాక్ అహమ్మద్ ఖాన్, ఆయన కుటుంబ సభ్యులు దేవాయలం నిర్మాణం కోసం రూ. 2. 50 కోట్ల విలువైన భూమిని రిజిస్టర్ చేయించారని మాజీ ఐపీఎస్ అధికారి కునాల్ మీడియాకు చెప్పారు. అహమ్మద్ ఖాన్ కుటుంబ సభ్యులు దేవాలయం కోసం భూమిని దానం చెయ్యడంతో రెండు మతాల ప్రజలు ఇంకా దగ్గర అయ్యారని మాజీ పోలీసు అధికారి కునాల్ అన్నారు.

రూ. 500 కోట్లతో దేవాలయం

రూ. 500 కోట్లతో దేవాలయం

ప్రపంచ ప్రసిద్ది చెందిన అంకోర్ వాట్ లోని దేవాయం కంటే ఇంకా పెద్దదగా చంపారణ్ లో ఈ దేవాలయం నిర్మిస్తున్నారు. ఈ దేవాలయం ఆవరణంలో 18 దేవాలయాలు నిర్మిస్తున్నారు. ఇక్కడ శివుడి దేవాలయం కూడా ఉంది. ఇదే ప్రాంతంలో ప్రపంచంలోని అతి పెద్ద శివలింగం కూడా ఏర్పాటు చేస్తామని మహావీర్ ట్రస్టు చీఫ్ ఆచార్య కిశోర్ కునాల్ మీడియాకు చెప్పారు. దేవాలయం నిర్మాణం కోసం రూ. 2. 50 కోట్ల భూమిని దానం చేసిన ముస్లీం ఇస్తియాక్ అహమ్మద్ ఖాన్ కు ధన్యవాదాలు చెబుతున్నామని ఆచార్య కిశోర్ కునాల్ మీడియాకు చెప్పారు.

English summary
Temple: Setting an example of communal harmony in the country, a Muslim family in Bihar has donated land worth Rs.2.5 crore for construction of the world's largest Hindu temple Virat Ramayan Mandir—in the Kaithwalia area of East Champaran district in the state
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X