అర్ధరాత్రి గుడిసెలకు మంటలు: 10మంది సజీవ దహనం

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్‌లో రంబాన్ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా ఉన్నారు.

పోలీసుల కథనం ప్రకారం రంబాన్ జిల్లాలోని చండర్‌కోటే ప్రాంతంలో తల్వాస్ వద్ద ఓ టన్నెస్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా కూలీల కోసం ఏర్పాటు చేసిన గుడిసెలు తగలబడ్డాయి. దీంతో ఈ ప్రమాదంలో 10 మంది సజీవ దహనమయ్యారు.

Ten people charred to death in Ramban in Jammu and Kashmir

అయితే అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో షార్ట్‌సర్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని జమ్మూ కాశ్మీర్ ఐజీపీ దనేష్ రాణా వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+