సారీ చెప్పి: సహారాకు మిరాచ్ హెచ్చరిక, సుబ్రతా కేసులో ట్విస్ట్‌

వాషింగ్టన్/న్యూఢిల్లీ: సహారా, మిరాచ్ క్యాపిటల్‌ల ఫోర్జరీ వివాదం మలుపులు తిరుగుతోంది. తమ ప్రతిష్టకు భంగం వాటిల్లిందని, దానికి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని సహారాను అమెరికాకు చెందిన మిరాచ్ క్యాపిటల్ కోరింది. లేదంటే 13 మిలియిన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని హెచ్చరించింది. అంటే దాదాపు రూ.78 కోట్లు.

సహారా అధినేత సుబ్రతా రాయ్‌రకు మిరాచ్ సీఈవో సారాంశ్ శర్మ ఈ మేరకు లేఖ రాశారు. సాధ్యాసాధ్యాల నివేదికకు సహారా ఇచ్చిన 2.6 మిలియన్ డాలర్లకు ఈ నష్టపరిహారం అదనమని శర్మ చెప్పారు. సహారాకు 2.05 బిలియన్ డాలర్ల రుణం (రూ.12,000 కోట్లు) ఇచ్చేందుకు ఇప్పటికీ సిద్ధంగా ఉన్నట్లు శర్మ చెప్పారు.

తమ పైన చేసిన ఆరోపణలను సహారా వెనక్కి తీసుకొని, క్షమపణ కోరితే తమకిచ్చిన 2.6 మిలియన్ డాలర్లు తిరిగి వెనక్కి ఇవ్వడానికి సిద్దమని చెప్పారు. అయితే ఈ లేఖ పైన తక్షణం సహారా నుండి ఎటువంటి స్పందన వలువడలేదు.

Tender apology or pay $13 million in compensation: Mirach warns Sahara

కాగా, పీకల్లోతు సంక్షోభంలో కూరుకు పోయిన సహారా గ్రూపు తమ చైర్మన్ సుబ్రతా రాయ్‌కి బెయిల్ సంపాదించడానికిసం నిధుల సేకరణకోసం జరిపే ప్రయత్నాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆ సంస్థకు అమెరికాకు చెందిన పెద్దగా ఎవరికీ తెలియని మిరాచ్ క్యాపిటల్ ఇవ్వజూపిన 200 కోట్ల డాలర్ల నిధులకు తాము బ్యాంకర్‌గా ఉన్నట్లు ఆ సంస్థ చేసిన ప్రకటనను బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇటీవల తోసిపుచ్చింది.

ఆ లావాదేవీలో మాకు ఏ విధంగాను సంబంధం లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ ప్రతినిధి ఒకరు పిటిఐకి తెలిపారు.

దాదాపు ఏడాదిగా తీహార్ జైల్లో మగ్గుతున్న సుబ్రతా రాయ్‌ని విడిపించుకోవడానికి అవసరమైన నిధుల సేకరణకోసం భారతీయ సంతతికి చెందిన శరాంశ్ శర్మకు చెందిన మిరాచ్ క్యాపిటల్‌తో సహారా ఇండియా గత నెల ఒక ఒప్పందం కుదర్చుకున్నట్లు వార్తలు రావడంతో బ్యాంక్ ఆఫ్ అమెరికా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. బ్యాంక్ ప్రకటన నేపథ్యంలో సహారా గ్రూపు మిరాచ్ సంస్థ పైన మండిపడింది. తాము చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ నేపథ్యంలో మిరాచ్ స్పందించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+