రాజస్థాన్‌లో విషాదం: టెంటు కూలి 14 మంది మృతి

రాజస్థాన్ : రాజస్థాన్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ టెంటు కూలడంతో 14 మంది మృతి చెందారు. ఈ ఘటన బార్మర్‌లో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం 4:30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడం, దానికి తోడు బీభత్సమైన గాలులు వీయడంతో భారీ టెంటు కూలింది. దీనికింద ఉన్నవారు 14 మంది మృతి చెందగా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

గాయపడిన వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు అధికారులు . రామకథ వినేందుకు స్థానికులు ఆ టెంటు కింద కూర్చున్నారు. అయితే వాతావరణం మారడం భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా టెంటు కుప్పకూలినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇక ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.2 లక్షలు ప్రకటించారు.

Recommended Video

    ఆదాయ పన్ను అధికారుల పై వేటు
    Tent collapsed in Rajasthans Barmer,14 killed several injured

    ఇక ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ట్వీట్ చేశారు. రామకథ వినేందుకు వచ్చిన వారిపై టెంట్ కూలడం దురదృష్టకరమన్నారు ప్రధాని మోడీ. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు సీఎం అశోక్ గెహ్లాట్ చెప్పారు. క్షతగాత్రులకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+