పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై ఉగ్రవాదుల దాడి
పఠాన్‌కోట్: పంజాబ్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై వారు దాడి చేశారు. శనివారం తెల్లవారుజామున పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. సైనిక దుస్తుల్లో ఎయిర్‌బేస్ వాహనంలో వచ్చిన ముష్కరులు ఒక్కసారిగా దాడికి దిగారు. నలుగురు ఉగ్రవాదులు ఎయిర్‌బేస్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ప్రతిఘటించాయి. ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు. ఇద్దరు భద్రతాధికారులు కూడా మరణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులతో పోరుకు మరిన్ని భద్రతాబలగాలను పఠాన్‌కోట్ తరలిస్తున్నారు.

పఠాన్‌కోట్‌లో శుక్రవారంనాడు గురుదాస్‌పూర్ ఎస్పీ సల్వీందర్‌సింగ్ కారులో వెళ్తుండగా సాయుధులు అపహరించారు. ఎస్పీ అపహరణ ఘటనతో ఉగ్రవాదులకు సంబంధం ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉగ్రవాదులు ఉపయోగించిన కారు ఎస్పీ ప్రయాణించినదేనన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
పంజాబ్‌లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటం 6నెలల వ్యవధిలో ఇది రెండో సారి. జులై 27న గురుదాస్‌పూర్ పోలీస్ స్టేషన్‌పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నలుగురు పోలీసులు అమరులయ్యారు. ఎయిర్‌బేస్‌లో మిగ్ 29, హెలికాప్టర్లపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. అయితే అవి సురక్షితంగా ఉన్నాయని అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications