యూపీ రైల్వే నెట్వర్క్ పై షాకింగ్ ఎటాక్ ప్లాన్.. ఉగ్రకుట్ర భగ్నం!

ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలీసులు ఒక ఉగ్రమూక కుట్ర భగ్నం చేసి పెను ప్రమాదం నుండి కాపాడారు. యూపీలో భద్రతా వ్యవస్థ అప్రమత్తంగా పనిచేసిన ఫలితంగా ఒక ప్రమాదకర ఉగ్రవాద ముఠా కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని కీలక నగరాలైన లఖ్‌నవూ, గజియాబాద్ ప్రాంతాల్లో రైల్వే రవాణాను లక్ష్యంగా చేసుకుని భారీ విధ్వంసానికి ఈ ముఠా ప్రణాళికలు రచించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

పాకిస్థాన్ నిఘా సంస్థ అయిన ISIతో సంబంధాలున్న ఉగ్రమూక అరెస్ట్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠాకు పాకిస్థాన్ నిఘా సంస్థ అయిన ISIతో సంబంధాలు ఉన్నట్లు స్పష్టమైంది. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న ఒక అనుమానాస్పద సంస్థ వీరికి ఆర్థిక, సాంకేతిక సహాయం అందించినట్లు కూడా అధికారులు పేర్కొన్నారు. ముఖ్యంగా వీరు రైల్వే నెట్వర్క్ ను టార్గెట్ చేసుకున్నారు. రైల్వే వ్యవస్థను దెబ్బతీసి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడం వీరి ప్రధాన లక్ష్యంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

Terror attack plan UP Police Arrest ISI Linked Terrorists they planned to do attacks on railway

రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ బాక్స్‌ లక్ష్యంగా ఎటాక్ ప్లాన్

ఈ కుట్రలో భాగంగా లఖ్‌నవూ రైల్వే స్టేషన్ సమీపంలోని సిగ్నల్ బాక్స్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా మీరట్ కు చెందిన ప్రధాన నిందితుడు సాకిబ్‌తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి అనేక కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

పాకిస్తాన్ హ్యాండ్లర్ లకు రైల్వే నెట్వర్క్ ఫోటోలు

ఈ ఉగ్రవాదుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాకిబ్ మరియు అతని సహచరులు దాడులకు ఎంపిక చేసిన ప్రదేశాల ఫోటోలు, వీడియోలు సేకరించి, వాటిని పాకిస్థాన్‌లో ఉన్న హ్యాండ్లర్లకు పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అదనంగా, ఆ ప్రాంతాల్లోని భద్రతా ఏర్పాట్లు, రైల్వే కార్యకలాపాలపై తాజా సమాచారం కూడా వారికి అందజేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అన్ని రైల్వేస్టేషన్లు, రైల్వే లైన్లపై నిఘా..

ఈ ఘటనతో రాష్ట్రంలో భద్రతా వ్యవస్థ మరింత కట్టుదిట్టం చేయబడింది. ఈ క్రమంలో అప్రమత్తం అయిన భద్రతా సిబ్బంది రైల్వే స్టేషన్లు, ముఖ్య ప్రజా ప్రదేశాల్లో తనిఖీలు పెంచారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు సూచిస్తున్నారు.మొత్తానికి, పోలీసుల వేగవంతమైన చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఈ ఘటన ఉగ్రవాద నెట్వర్క్‌లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. ఇంకా ఉగ్రవాద నెట్వర్క్ చాపక్రింద నీరులా ఉందన్న దానికి ఊతం ఇస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+