హోటల్ నుంచి అనుమానిత ఉగ్రవాదుల పరారీ!

భువనేశ్వర్: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో నలుగురు అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు అనుమానిత ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తున్నారు.

భువనేశ్వర్‌లోని ఓ హోటల్‌లో ఉండేందుకు నలుగురు వ్యక్తులు వచ్చారు. గుర్తింపు కార్డులు అడగ్గా.. ఆ నలుగురు అక్కడ్నుంచి పారిపోయారు. కాగా, ఈ విషయం పోలీసుల దాకా వెళ్లింది. ఆ నలుగురు ఉగ్రవాదులే అయి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Terror Shadow In Odisha As Suspected Men Flee Bhubaneswar Hotel

ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారుతో అనుమానిత ఉగ్రవాదులు వచ్చారని, వారందరూ విదేశీయులేనని వారిని చూసిన కొందరు తెలిపారు. అయితే, ఆ వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ నకిలీదే అయి ఉంటుందని భావిస్తున్నారు.

గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని దేశ వ్యాప్తంగా పోలీసులు, భద్రతా దళాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశాయి. ఐఎస్ ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+