సైకిల్ బాంబు పేలి 4గురి మృతి, కెఎల్ఓపై అనుమానం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో సైకిల్ బాంబు పేలి నలుగురు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. కామ్‌తాపూర్ లిబరేషన్ ఆర్గనైజేషన్‌కు (కెఎల్ఓ) చెందిన వారు ఈ బాంబు పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ పేలుడు రాష్ట్రంలోని జల్‌పాయ్‌గురి జిల్లాలో గురువారం సాయంత్రం జరిగింది.

Terrorism back in Bengal: Major bomb blasts in Jalpaiguri, 4 dead

ఈ ఘటనలో నలుగురు మృతి చెందారని, మరికొంతమంది గాయపడ్డారని, బాంబును సైకిల్ పైన పెట్టారని ఉత్తర బెంగాల్ ఇన్స్‌పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు శశికాంత్ పూజారి తెలిపారు.

ఈ ఘటన సాయంత్రం ఏడు గంటలకు జరిగింది. ఆరుగురు గాయపడ్డారని జిల్లా డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ప్రభాత్ చక్రవర్తి చెప్పారు. గాయపడ్డ వారిని జల్‌పాయ్‌గురి జిల్లా ఆసుపత్రికి చికిత్స కోసం తరలించినట్లు తెలిపారు.

కెఎల్ఓ మిలిటంట్స్ ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని తాము అనుమానిస్తున్నామని, ఇటీవలే ఆ సంస్థకు చెందిన పలువురిని అరెస్టు చేశామని, ఈ అరెస్టులకు ప్రతీకారంగా ఈ పేలుళ్లకు పాల్పడి ఉంటారని శశికాంత్ పూజారి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+