కరుడు గట్టిన ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అరీజ్ ఖాన్ అరెస్టు

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కరుడు గట్టిన ఉగ్రవాది అరీజ్ ఖాన్‌ను డిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు బుధవారంనాడు అరెస్టు చేశారు. వాంటెడ్‌గా ఉన్న ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాది అయిన అరీజ్ ఖాన్ చాలా కాలంగా తప్పించుకుని తిరుగుతున్నాడు.

2008లో బాట్లా ఎన్‌కౌంటర్ జరిగినప్పటి నుంచి 32 ఏళ్ల అరీజ్ ఖాన్ అలియాస్ జునైద్ పరారీలో ఉన్నాడు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన అరీజ్ ఖాన్ ఉగ్రవాదిగా మారాడు.

బాట్లా ఎన్‌కౌంటర్ నుంచి అతను తప్పించుకున్నాడు. ఈ ఘటనలో చాంద్ శర్మ మరణించాడు. అతన్ని ఇండో నేపాల్ సరిహద్దుల్లో పట్టుకున్నారు. అతని అరెస్టును డిసిపి (స్పెషల్ సెల్) డిసిపి పిఎస్ కుష్వాహ ధృవీకరించారు.

Terrorist Ariz Khan arrested, Wanted Indian Muzahideen arrest

ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌కు చెందిన జునైద్ ఢిల్లీలోని జామియానగర్‌ బాట్ల హౌస్‌లోని నెంబర్ ఎల్ - 18లో ఉన్న సమయంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఆ ఎదురుకాల్పులు ఆరు రోజుల పాటు జరిగాయి.

ఢిల్లీలో పహర్గంగ్, భరఖమాబ రోడ్డు, కన్నాట్ ప్లేస్,, గ్రేటర్ కైలాస్ పురి, గోవింద్ పురి సీరియల్ పేలుళ్ల తర్వాత ఆ ఘటన జరిగింది. 2008లో ఢిల్లీలో జరిగిన ఈ వరుస బాంబు పేలుళ్లలోనే కాకుండా ఇతర పేలుళ్ల ఘటనల్లో కూడా పాల్గొన్నట్లు డిసిపి చెప్పారు.

అరీజ్ ఖాన్ బాంబు తయారీలో నిపుణుడు మాత్రమే కాకుండా కుట్రదారుడు, సూత్రధారి కూడా అని డిసిపి చెప్పారు. బాట్లా ఎన్‌కౌంటర్‌లో మరణించిన అతిఫ్ అమీన్ అనుచరుడు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wanted Indian Mujahideen terrorist Ariz Khan was arrested by the Special Cell of Delhi Police on Wednesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి