జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ అలజడి - సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి
ఆర్టికల్ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి కోల్పోయి, ఇండియాలో పూర్తిగా విలీనమైపోయిన జమ్మూకాశ్మీర్ లో ఏడాది తర్వాత మళ్లీ అలజడి నెలకొంది. సోమవారం సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేయడం సంచలనంగా మారింది. కుల్గాం జిల్లాలోని నెహమాలో ఉన్న సీఆర్పీఎఫ్ శిబిరంపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు జవాన్లు గాయపడ్డట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి.. నెహమా సీఆర్పీఎఫ్ క్యాంపులోకి చొరబడేందుకు విఫలయత్నం చేసిన ఉగ్రవాదులు.. చెక్ పోస్టుపై విచక్షణా రహితంగా కాల్పులు చేసి పరారయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్ ను ఆస్పత్రికి తరలించారు. పరారైన టెర్రరిస్టుల కోసం బలగాలు వేట మొదలుపెట్టాయి. ఈక్రమంలో దక్షిణ కాశ్మీర్ అంతటా కార్డెన్ సెర్చ్ చేపట్టారు.

సీఆర్పీఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి జరగడానికి కొద్ది గంటల ముందు, సోమవారం ఉదయం ఉత్తర కాశ్మీర్ లో ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. బారాముల్లా జిల్లాలోని కరీవీ గ్రామంలో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను మన బలగాలు హతమార్చాయి. ఎన్ కౌంటర్ కు ప్రతీకారంగానే దాడి చేశారా? ఇది ఏ గ్రూపు పని? అనే వివరాలు తెలియాల్సిఉంది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్ వ్యాలీలో టెర్రరిజం 40 శాతం తగ్గిపోయింది. ఉగ్రవాదంపైపు ఆకర్షితులవుతున్న వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. సైనిక పరంగా ఉక్కుపాదం మోపడం, కాశ్మీరీల్లో భరోసా కల్పించే ప్రయత్నాలు ముమ్మరం కావడంతోనే ఈ మార్పు సాధ్యమైంది. గడిచిన ఏడాది కాలంలో ఉగ్రవాదానికి ఆకర్షితులైన వారు కేవలం 67 మంది మాత్రమేనని వెల్లడైంది. దాదాపు ఏడాదిగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో ఇవాళ్టి ఉగ్రదాడి ఘటన కలకలం రేపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications