'టెర్రరిస్టులకు మతం లేదు': సుష్మా ప్రసంగం భేష్ అంటూ ప్రధాని ప్రశంస

న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితిలో భారత విదేశాంగ శాఖ మంత్రి హోదాలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగంపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ఉగ్రవాదంపై భారత్ నిర్ణయాన్ని తెలియజేస్తూ పాకిస్థాన్‌కు తగిన రీతిలో గుణపాఠం చెప్పారంటూ ఆయన సుష్మాను ఆకాశానికెత్తేశారు.

ఈ విషాయన్ని ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. తీవ్రవాదులకు మతం లేదని చెప్పిన సుష్మ ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగలేవని ఐక్యరాజ్య సమితి వేదికపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి కోసం పాకిస్థాన్ ప్రధాని చెప్పిన నాలుగు సూత్రాలు అవసరం లేదని, ఉగ్రవాదాన్ని ఆపేసి కూర్చోని మాట్లాడునే ఒకే ఒక్కసూత్రం చాలని సుష్మా తన ప్రసంగంలో పేర్కొన్నారు.

 'Terrorists don't have religion': Sushma Swaraj hits back at Pakistan in UN speech, Modi says 'excellent'

ఉగ్రవాదంపై పాకిస్థాన్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పిన సుష్మా, పాక్‌లో ముంబై దాడుల సూత్రధారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడమే కాక, వారికి సాయం చేస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+