స్మృతి ఇరాని చీర రూ. లక్ష, కేబినెట్ కు ఫిర్యాదు (ఫోటోలు)
న్యూఢిల్లీ: కేంద్ర జౌళి శాఖా మంత్రి స్మృతి ఇరానీకి ఆ శాఖ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి రశ్మి వర్మ పెద్ద షాక్ ఇచ్చారు. కేంద్ర మంత్రి ఇచ్చిన బిల్లులు తాను అమోదించలేనని కేబినెట్ సెక్రటరీకి పంపించారు.
సీనియర్ ఐఏఎస్ మహిళా అధికారి రశ్మి వర్మ చేసిన ఫిర్యాదు చివరికి ప్రధాని కార్యాలయం వరకు వెళ్లిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇలాగే ప్రవర్థిస్తే తాను ఇక్క పని చెయ్యలేనని రశ్మి వర్మ లిఖితపూర్వకంగా కేబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు.
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి, ఆ శాఖ కార్యదర్శి రశ్మి వర్మకు ఓ బిల్ విషయంలో విభేదాలు వచ్చాయి. వినాయకచవితి పండుగ సందర్బంగా స్మృతి ఇరానీ షాపింగ్ చేసి ఆ బిల్లు ఇవ్వడంతో ఇద్దరి మద్య గొడవ మొదలైయ్యింది.

లక్ష రూపాయల చీర
కేంద్ర జౌళి శాఖా మంత్రి స్మృతి ఇరానీ లక్ష రూపాయల విలువైన చీర తీసుకున్నారని, ఆ బిల్లు పాస్ చెయ్యాలని తన కార్యాలయానికి పంపించారని రశ్మీ వర్మ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

రూ. 8 లక్షల బిల్లు
వినాయకచవితి పండుగ సందర్బంగా చీరలు, వినాయకుడి విగ్రహంతో పాటు వివిధ వస్తువుల కోసం షాపింగ్ చేసి రూ. 8 లక్షలు బిల్లు ఇచ్చారని, ఆ బిల్లు పాస్ చెయ్యాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చెప్పారని, నేను బిల్లు పాస్ చెయ్యలేదని కేబినెట్ సెక్రటరీకి సమాచారం ఇచ్చారు.

ప్రధాని చెవిలో పడింది
స్మృతి ఇరానీ షాపింగ్ చేసి ఖరీదైన వస్తువులు కొనుగోలు చేశారని చివరికి ప్రధాని నరేంద్ర మోడీ వరకు వెళ్లింది.

ఇరకాటంలో మేడమ్
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఇప్పుడు ఇరకాటంలో పడ్డారు. బీహార్ కు చెందిన సిన్సియర్ ఐఏఎస్ అధికారి (1982 బ్యాచ్) రశ్మి వర్మ కేబినెట్ సెక్రటరీకి ఫిర్యాదు చెయ్యడంతో ఆమె తలపట్టుకున్నారు.

మంత్రి ప్రవర్తనలో మార్పురావాలి
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీలో మార్పు రాకుంటే తాను ఆ శాఖలో పని చెయ్యలేనని రశ్మి వర్మ పై అధికారులకు చెప్పారు.












Click it and Unblock the Notifications